వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మీ.. డాడీ.. బీడీ వద్దు, అమ్మ, నాన్న, అక్క‌, బావ ముద్దు! : వెంకయ్య

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి : ఇంగ్లీష్ నేర్చుకోవడం వరకు ఓకె గానీ బ్రిటీష్ వారి మనస్తత్వాన్నే అలవరుచుకోవద్దని సూచించారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. మమ్మీ.. డాడీ.. బీడీ అని కాకుండా..అమ్మ, నాన్న, అక్క‌, బావ అని మాతృభాష‌లో చక్కగా సంబోధించాలని చెప్పారు.బోధ‌న ఆంగ్ల‌మ‌యినా వ్యక్తిత్వ భావ‌నల్లో భార‌తీయ‌త స్పష్టమవాలన్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లా సామ‌ర్ల‌కోట‌లో బీజేపీ నేత‌లు ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య. చాలా మంది మ‌న భాష మ‌ర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. మన అలవాట్లన్నీ భారతీయతను వ్యక్తీకరించేలా ఉండాలన్నారు. ప్రపంచమంతా భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటుంద‌ని, మ‌న యాస గోస భాష‌ క‌ట్టు బాట్లలో ఎంతో గొప్ప‌ద‌నం దాగుందని తెలిపారు.

Venkaiah interesting comments in his speech

దేశంలో అజ్ఞానాన్ని పూర్తిగా రూపుమాపాలని, ఇందుకోసం దేశ యువత అంతా స‌క్ర‌మ మార్గంలో న‌డుచుకోవాలని, అప్పుడే నిజమైన దేశాభివృద్ధి జ‌రుగుతుంద‌ని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఇదే వేదికపై అబ్దుల్ కలాం గురించి, నరేంద్రమోడీ గురించి కొనియాడారు. 'పేప‌ర్ బాయ్ అబ్దుల్ క‌లాం దేశానికి రాష్ట్ర‌ప‌తి అయ్యారు... న‌రేంద్ర మోదీ టీ అమ్మారు ఇప్పుడు మ‌హానాయ‌కుడు కాగలిగారు' అంటూ ప్రశంసించారు.

ఏ దేశంలో అడుగుపెట్టినా.. యువత మోడీ నామస్మరణ చేస్తున్నారని, మోడీని, కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భార‌త మాతాకీ జై అంటే దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ జ‌య‌ము క‌లుగుగాకా అని అర్థం' అని వెంకయ్య వివరించారు.మతం, కులం వ్య‌క్తిగ‌తమైన అంశాల‌ని వాటి విషయంలో గొడవలు సరికాదని తెలియజేశారు.

English summary
AP BJP leaders arranged a felicitation for Central minister venkaiah naidu. On this occasion venkaiah shared a few words about telugu greatness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X