ముందడుగు: సిఎంల మధ్య చర్చలపై వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ముఖ్యమంత్రులు సమస్యలపై కూర్చొని మాట్లాడుకోవడం శుభపరిణామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అర్ధవంతమైన చర్చలు ఇంకా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కలిసి మాట్లాడుకోవడంపై సోమవారం మీడియా వద్ద ఆయన స్పందించారు. చర్చల విషయంలో కేంద్రం నుంచి ఏ సహాయం చేయాలన్నా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హడావుడిగా రాష్ట్ర విభజన జరగడంవల్లే సమస్యలు వచ్చాయని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ కలిసి కూర్చోని మాట్లాడుకోవడం సమస్యల పరిష్కారానికి ఒక ముందడుగుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంకా చర్చలు కొనసాగవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం లాంఛన ప్రాయంగానే కాకుండా అర్థవంతమైన రీతిలో చర్చలు కొనసాగాలని, మనసు విప్పి మాట్లాడుకోవాలని, జఠిలమైన సమస్యలు ఉంటే వాటిపై విస్తారంగా చర్చించాలని, ఈ విషయంలో ఎలాంటి సహకారం అందించడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications