మహిళలు కంగారు పడొద్దు, కానీ: బంగారంపై తేల్చేసిన వెంకయ్య
బంగారంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: బంగారంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తమ వద్ద ఉన్న బంగారం గురించి మహిళలు కంగారుపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
వారసత్వ బంగారం గురించిన లెక్కలను కేంద్రం అడగబోదని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్న బంగారానికి మాత్రం లెక్క చెప్పక తప్పదని ఆయన తేల్చి చెప్పారు.

బంగారంపై కేంద్రం
ఐటీ దాడుల్లో బంగారం పట్టుబడితే ప్రతి గ్రాముకు లెక్క చూపించవలసి ఉంటుంది. వివాహిత వద్ద 500 గ్రాముల బంగారం, అవివాహితుల వద్ద 250 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల వివరాలు వెల్లడించింది. పురుషుల వద్ద వంద గ్రాముల బంగారం ఉండవచ్చు. ఇప్పటికే వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే పన్ను లేదు. వారసత్వంగా వచ్చిన బంగారం పైన కూడా పన్ను లేదు. పన్ను మినహాయింపు ఉన్న సొమ్ముతో బంగారం కొనుక్కోవచ్చు.












Click it and Unblock the Notifications