బీజేపీ నా పార్టీ కాదు, బాధతో చెబుతున్నా: వెంకయ్య భావోద్వేగం
పార్టీని వీడుతున్నప్పుడు తాను భావోద్వేగానికి లోనయ్యానని, బాధగా ఉన్నప్పటికీ.. బిజెపి ఇక నా పార్టీ కాదని చెబుతున్నానని, ఈ రోజు నుంచి తన పాత్ర మారుతోందని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య మంగళవారం అన
న్యూఢిల్లీ: పార్టీని వీడుతున్నప్పుడు తాను భావోద్వేగానికి లోనయ్యానని, బాధగా ఉన్నప్పటికీ.. బిజెపి ఇక నా పార్టీ కాదని చెబుతున్నానని, ఈ రోజు నుంచి తన పాత్ర మారుతోందని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య మంగళవారం అన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా తల్లిగా భావిస్తూ వచ్చిన బిజెపి, ఇక తన పార్టీ కాదన్నారు.

బిజెపిని వదిలినందుకు బాధగా ఉన్నప్పటికీ, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఎత్తుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు.
నాకు ఘనమైన చరిత్ర ఏమీ లేదన్నారు. తనను ఇంతవాడిని చేసింది పార్టీయే అన్నారు. తాను ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతను అంగీకరించలేదన్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. ఇష్టపూర్వకంగానే బాధ్యతలు స్వీకరిస్తున్నానని చెప్పారు.
రాజ్యాంగ నియమ, నిబంధనలు, ఆదర్శాలకు లోబడి పని చేస్తానని చెప్పారు. ఇకపై పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడే అవకాశం తనకు లేదని చెప్పారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.
పెద్దల సభ గౌరవం మరింత పెరిగేలా పని చేస్తానని చెప్పారు. ఏడాదిన్నర వయస్సులోనే తాను తల్లిని కోల్పోయానని, తల్లిలాంటి పార్టీ తనను ఇంతవాడిని చేసిందని చెప్పారు.
తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని చెప్పారు. తాను ఈ పదవికి ఎంపికైతే, పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని చెప్పారు. గతంలో ఉప రాష్ట్రపతులుగా పని చేసిన వారి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications