విశాఖలో మరో మణిహారం: కేంద్రమంత్రి (ఫోటోలు)
విశాఖపట్నం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దత్తత తీసుకున్న చేపలుప్పాడ గ్రామంలో శుక్రవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి థాపర్‌చంద్ గెహ్లెట్ కూడా ఆయన వెంట ఉన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
అనంతరం ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానంలో శుక్రవారం జరిగిన వికలాంగులకు సహాయ పరికరాలు, సహాయ సాధనాల పంపిణీ, సామాజిక న్యాయ శిబిరంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి గెహ్లాట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖలో ప్రాంతీయ వికలాంగులు స్టేడియం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి గెహ్లాట్ ప్రకటించారు.
విద్యుత్ మోటార్‌తో నడిచే రూ. 40 వేల ఖరీదైన ట్రైసైకిళ్లను ఉచిత పంపిణీకి విశాఖ నుంచి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి 1000 పంపిణీ చేయనుండగా, విసాఖలో 16 మందికి అందజేశారు. పదమూడు వందల మంది వికలాంగులకు రూ. 1.30 కోట్ల విలువైన వివిధ పరికరాలను ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు.

విశాఖలో వికలాంగుల ప్రాంతీయ క్రీడా మైదానం
ఈ సందర్భంగా గెహ్లాట్ ప్రసంగిస్తూ దేశంలో వికలాంగుల సంఖ్యపై కచ్చితమైన లెక్కలు లేవన్నారు. కానీ 3 కోట్ల మంది ఉంటారనే అంచనాతో వారి కోసం సంక్షేమ పథాకలు రూపొందిస్తున్నామన్నారు. వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నామన్నారు.

విశాఖలో వికలాంగుల ప్రాంతీయ క్రీడా మైదానం
వారి కోసం దేశంలో ఐదు ప్రాంతీయ మైదనాలు ఏర్పాటు చేయనున్నామని, దానికో ఒకటి విశాఖపట్నంకు కేటాయించామని అన్నారు. మైదానానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చితే రూ. 50 కోట్ల వ్యయంతో అతి త్వరలో మైదానం నిర్మిస్తామన్నారు.
విశాఖలో వికలాంగుల ప్రాంతీయ క్రీడా మైదానం
దీనిపై ఎంపీ హరిబాబు వెంటనే స్పందిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత నియోజక వర్గం భీమిలిలో 20 ఎకరాలు ఇప్పటికే గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని మంత్రికి తెలిపారు.

విశాఖలో వికలాంగుల ప్రాంతీయ క్రీడా మైదానం
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లుగా వికలాంగులకు ప్రత్యేక వసతి గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు.

విశాఖలో వికలాంగుల ప్రాంతీయ క్రీడా మైదానం
ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల్లో వికాలంగులకు ర్యాంపు లేదా లిఫ్ట్ సౌకర్యం ఉండాలని, విశాఖ కోర్టు, కలెక్టరేట్‌లో కేంద్రం నిధులతో వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

విశాఖలో వికలాంగుల ప్రాంతీయ క్రీడా మైదానం
సంఘటిత కార్మికులకు రాబోయే రోజుల్లో బీమా, ఫించన్ సౌకర్యాలను విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు.













Click it and Unblock the Notifications