నరసరావుపేటకు ఎంతో గొప్ప చరిత్ర: 'ఉద్యమాలకు ఊపిరిగా, పౌరుషానికి ప్రతీకగా నిలిచింది'
అమరావతి: అభివృద్ధి బాటలో నరసరావుపేట దూసుకుపోతోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో రెండో రోజు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ముందుగా రైల్వే అండర్ బ్రిడ్జి, టౌన్‌హాల్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ శతాబ్ధి ఉత్సవాల ద్వారా ప్రజలు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు కంచుకోట... కలల కాణాచి నరసరావుపేట అని పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఉద్యమాలకు ఊపిరిగా, పౌరుషానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలను చవి చూసిందన్నారు.

అనేక వర్గాల కోసం నరసరావుపేటలో శ్మశాన వాటికలను నిర్మించారని, జిల్లా కేంద్రం గుంటూరు అయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసించేది మాత్రం నరసరావుపేటేనని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. కన్న తల్లిని, జన్మభూమిని, దేశాన్ని మరచిన వారు మానవులే కాదన్న వెంకయ్య, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నరసరావుపేటను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని మెచ్చుకున్నారు.
నరసరావు పేట ప్రాంతం నుంచి ఎందో మంది మహానుభావులు రాజకీయాల్లో ఉన్నారని, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, కాసు వెంకట కృష్ణారెడ్డి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు ఈ ప్రాంత వ్యక్తే కాగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే కావడం కాకతాళీయమన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications