అవేం మాటలు, పవన్ కళ్యాణ్‌ను నమ్మవద్దు!: పరోక్షంగా వెంకయ్య
కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు శుక్రవారం నాడు చురకలు అంటించారు.
విశాఖ: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు శుక్రవారం నాడు చురకలు అంటించారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ చెప్పే వారిని ఏమాత్రం నమ్మవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
విశాఖ ఉత్సవాల సందర్భంగా ఆయన భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం అని, ఆ రోజు ఆందోళనలు, నిరసనలు చేయడం, చేయాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
బిల్లు పెట్టినప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్, పవన్ కళ్యాణ్‌లు రిపబ్లిక్ డే రోజున నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన గత కొద్ది రోజులుగా వెంకయ్య ధీటుగానే స్పందిస్తున్నారు. ఇరువురి మధ్య పరోక్షంగా వాగ్యుద్ధం జరుగుతోంది. పవన్ నేరుగా వెంకయ్య పేరును సంభోదిస్తుండగా, వెంకయ్య ఎక్కువగా ఆయన పేరు చెప్పకుండా చురకలు అంటిస్తున్నారు.
రిపబ్లిక్ డే తర్వాత కూడా ఓసారి వెంకయ్య మాట్లాడుతూ.. జల్లికట్టు ఆటను 2011లో కాంగ్రెస్ పార్టీయే నిషేధించిందని, కానీ జల్లికట్టు కోసం తమ పార్టీ ఆర్డినెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. జల్లికట్టు అంశంపై కూడా పవన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
దానికి వెంకయ్య కౌంటర్ ఇచ్చారు. జల్లికట్టు ముసుగులో బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. దేశంలో మిషన్ మోడీ నడుస్తోందన్నారు. కొంతమందికి పనిలేక ట్విటర్‌పై కూర్చుంటున్నారని, ఫాలోయింగ్ లేని ట్విటర్ పోస్టింగ్‌లు వృథాయేనని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని ట్విటర్‌లో లక్షలమంది ఫాలో అవుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications