ఇక చాలు కానీ!: తెలుగులో వెంకయ్య ట్వీట్, షాకిచ్చిన ఏపీ వ్యక్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/విజయవాడ: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుగులో ట్వీట్ చేశారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడం, వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే మోడీ ప్రభుత్వం ధ్యేయం అని అభిప్రాయపడ్డారు.

ఆయన రెండు వరుస ట్వీట్లు చేశారు. 'పేదలకు దగ్గరగా, అవినీతికి దూరంగా, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యంగా ముందుకు వెళ్లడమే, ప్రభుత్వ ఉద్దేశ్యం. పేదలకు స్వాంతన కల్పించడం, వారిని అభివృద్ధి పథంలో నడిపించడం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరకుంటే అభివృద్ధి అనే పదానికి, ప్రజాస్వామ్యానికి అర్థం లేదు' అని ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్లకు కొందరు రీట్వీట్ చేశారు. 'నమ్మించి మోసం చేయవద్దు.. ఆంధ్రకు ప్రత్యేక హోదా తీసుకురండి', 'మీ మాటల గారడీలు ఇక కుదరవు నాయుడుగారు' అని ఒకరు ట్వీట్ చేశారు. మరికొందరు ఆయన పైన ప్రశంసలు కురిపించారు. వెంకయ్య నాయుడు తెలుగు కింగ్ అని ఒకరు ట్వీట్ చేశారు.

కాగా, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. విభజన సమయంలో ఏపీకి అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే, వెంకయ్య, బీజేపీ నేతలు పదేళ్ల కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ హోదా రాలేదు. దీంతో బీజేపీ ఇరుకున పడిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister and BJP leader Venkaiah Naidu tweets in Telugu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి