మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విష ప్రచారం: కేంద్ర మంత్రి వెంకయ్య
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందంటూ ఆయన విమర్శించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ అసహనంపై కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు.

కాశ్మీరీ పండిట్లను బయటకు పంపినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాలు పేరిట కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేసిందని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి అజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
స్కూళ్లలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు: మంత్రి నారాయణ
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో దశల వారీగా ఇంగ్లీషు మీడియంలోనే బోధన ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఆరు నెలల్లోగా జీవీఎంసీ ఎన్నికలు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని భీమిలి, అనకాపల్లి విలీన పంచాయతీల్లో న్యాయపరమైన వివాదాలున్నాయని, అవి పూర్తయ్యాక జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయన్నారు.












Click it and Unblock the Notifications