పార్టీలకు అడిగే హక్కు లేదు: 'ప్రత్యేకం'పై వెంకయ్య
న్యూడిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ఎంతో కీలకమైనదని, దాన్ని రాజకీయం చేయడం సరికాదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకు ఉందని, రాజకీయ పార్టీలకు కాదని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తున్నామని వెంకయ్య తెలిపారు.

ఏపీ ఆర్థికలోటుపై ఆర్థిక, హోంశాఖలు చర్చిస్తున్నాయని చెప్పారు. హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తున్నామని వెంకయ్యనాయుడు వివరించారు.
ఏపీ ఆర్థికలోటుపై ఆర్థిక, హోంశాఖలు చర్చిస్తున్నాయని, హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications