దత్తాత్రేయ అలయ్ బలయ్ చిచ్చు: వెంకయ్య అలక
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఆ పార్టీలో అసంతృప్తి సెగలు రాజేసినట్లుగా కనిపిస్తోంది. దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ సంప్రదాయమైన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దత్తన్న మంగళవారం జలవిహార్ వద్ద నిర్వహించి అలయ్ బలయ్ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు వచ్చారు. కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు, టి జెఏసి నేతలు పలువురు వెంకయ్యనాయుడి విషయాన్ని ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు.

అయితే, తన విషయాన్ని విహెచ్, టిజెఏసి నేతలు ప్రస్తావించినప్పుడు తెలంగాణ ప్రాంత బిజెపి నేతలు ఎందుకు అడ్డుకోలేదని, వారి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని వెంకయ్యనాయుడు అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది. వారి వ్యాఖ్యలను బిజెవైఎం అధ్యక్షుడు ఖండించారు. ఇతర నేతలు పెదవి విప్పక పోవడంపై వెంకయ్య అలక వహించారట.
రాజ్‌నాథ్ ఢిల్లీ పర్యటన వాయిదా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయినట్లు బిజెపి నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications