వారితో నేను మాట్లాడను, ఆరోగ్యం పాడై ఉంటుంది: కత్తి మహేష్‌కు వేణుమాధవ్ చురకలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పెద్దవాళ్లు, అంకుల్స్‌తో తాను మాట్లాడనంటూ మహేష్ కత్తిపై హాస్యనటుడు వేణుమాధవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఓ టీవీ ఛానల్‌లో మహేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ లైన్ ద్వారా వేణుమాధవ్ స్పందించారు.

'యాంకర్ సత్య.. మీరు నాకు పరిచయం కనుక, నేను మీతోనే మాట్లాడతాను. పరిచయం లేని వాళ్లతో నేను మాట్లాడను. మీ ద్వారా పవన్ కళ్యాణ్ అభిమాని కిరణ్ రాయల్‌కు, పవన్ అభిమానులందరికీ, జనసేన ఫ్యాన్స్‌కి నేను తెలియజేస్తున్నదేమిటంటే.. దయచేసి, ఎవరూ లైవ్‌లో మాట్లాడకండి. ఆడవాళ్ల మీద, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులపైనా మాట్లాడితే, వారిపై చర్యలు తీసుకోక తప్పదు.' అని వేణు మాధవ్ చెప్పారు.

Venu Madhav indirect comments on Mahesh Kathi

తాను ఎవరినీ విమర్శించనని, విమర్శించే అలవాటు తనకు లేదని, పెద్దవాళ్లు, అంకుల్స్‌తో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడనని కత్తి మహేష్‍‌ను ఉద్దేశించి అన్నారు. వాళ్లను గౌరవించే అలవాటు తనకు ఉందని, ఆ అంకుల్‌ను గౌరవించాల్సిన బాధ్యత తనకు ఉందని వ్యాఖ్యానించారు.

తన ఉద్దేశంలో ఆయనకు ఆరోగ్యం పాడై ఉంటుందని కత్తి మహేష్‌ను ఉద్దేశించి వేణు మాధవ్ అన్నారు. గతంలో తిరుమలకు వెళ్లిన పూనమ్ కౌర్.. పవన్ కల్యాణ్ గోత్రనామాలతో పూజలు చేయించుకున్నదని కత్తి మహేశ్ ఆరోపణల కారణంగా పవన్ అభిమానులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కత్తి మహేశ్‌పై పవన్ అభిమాని కిరణ్ రాయల్ మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Venu Madhav indirect comments on Mahesh Kathi, who is criticising Jana Sena chief Pawan Kalyan again and again.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి