ప్రముఖ మీడియా ప్రతినిధి బండారం బయటపెట్టిన వేణు స్వామి..కాల్ రికార్డు మొత్తం లీక్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పారాయన.ఆయన చెప్పినట్టుగానే నాగ చైతన్య , సమంతలు విడిపోయారు. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాలు గురించి కూడా చెప్పడం జరిగింది. తాజాగా నాగ చైతన్య , శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై తనదైనశైలిలో రియాక్ట్ అయ్యారు.

నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని.. అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్‌కు ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణు స్వామి తేల్చేశారు. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో బైట్‌ను చూపించారు.

Venu Swamy made sensational allegations against a prominent media representative

అయితే ఈ వేణు స్వామి ఇలా సెలబ్రిటీల జాతకాల గురించి బహిరంగంగా చెప్పడంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఈ విషయంపై వేణు స్వామితో మాట్లాడారు. దీంతో ఇక మీదట తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనని వేణు స్వామి తెలిపారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు.ఈ వీడియోలో ప్రముఖ జర్నలిస్ట్‌పై వేణు స్వామి సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ జర్నలిస్ట్‌ మూర్తి తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 2017లో ఓ వార్త ఛానెల్‌లో ఉన్నప్పుడు ఆయన నన్ను డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు.

వారు అడిగిన డబ్బులు ఇవ్వలేదని నన్ను నాశనం చేయాలని చూశారు. మళ్లీ గత ఎనిమిది నెలల నుంచి తిరిగి నా మీద మూర్తి ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించారని వేణు స్వామి ఈ వీడియోలో పేర్కొన్నారు. వారికి తాను లొంగకపోవడంతో..వారి ఛానెల్స్‌లో నా మీద డిబేట్లు పెట్టి, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జర్నలిస్ట్ మూర్తిపై వేణు స్వామి ఆరోపణలు చేశారు. ఒకనొక సమయంలో తాను వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. వేణు స్వామి భార్య జర్నలిస్ట్‌ మూర్తి అనుచరుడు అమర్‌తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా వేణు స్వామి ఈ తన వీడియోలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వేణు స్వామి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి తనపై వచ్చిన ఆరోపణలపై జర్నలిస్ట్ మూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+