వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్ దెబ్బకి విహెచ్ ఔట్, ప్రతి నెల గంటా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ లోకసభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శనివారం చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, చివరి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన అంబరుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి విహెచ్ ఓడిపోయారు.

కాగా, క్రీడలకు అవసరమైన అన్ని హంగులు ఉన్న హైదరాబాదును స్పోర్ట్స్ సిటీగా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని నగరంలో సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ ర్యాలీలకు డీ శ్రీనివస్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్‌లు నేతృత్వం వహిస్తారని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే పైన అపోహలు వద్దన్నారు. దీనవల్ల రాష్ట్రంలో ఏయే కులాలు, వృత్తుల వారు ఎందరున్నారో తెలుస్తుందన్నారు.

విహెచ్

విహెచ్

మెదక్ లోకసభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శనివారం చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, చివరి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

విహెచ్

విహెచ్

ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన అంబరుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి విహెచ్ ఓడిపోయారు.

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

కోట్ల విజయభాస్కర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. పక్కన ఇతర తెలంగాణ నాయకులు.

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

కోట్ల విజయభాస్కర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. పక్కన ఇతర తెలంగాణ నాయకులు.

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

కోట్ల విజయభాస్కర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. పక్కన ఇతర తెలంగాణ నాయకులు.

జీవీఎంసి

జీవీఎంసి

ప్రతి నెల ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ అధికారులను మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశించారు.

జీవీఎంసీ

జీవీఎంసీ

శనివారం సాయంత్రం విశాఖ నగర ఎమ్మెల్యేలతో కలిసి జీవీఎంసీ సమావేశపు మందిరంలో గంటా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు రే పథకాన్ని వేగవంతం చేయాలన్నారు.

జీవీఎంసీ

జీవీఎంసీ

నగరంలో ఒకటిన్నర లక్షల మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని, వారందరికీ గృహ వసతి కల్పించాలని, మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించడానికి ఆరు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయని, ఆ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

జీవీఎంసీ

జీవీఎంసీ

జోన్ల వారీగా పింఛన్ మేళాలను నిర్వహించి అర్హులకు అందచేయాలని గంటా సూచించారు. జాతీయ క్రీడలు నిర్వహించే స్థాయిలో స్టేడియంలో నిర్మాణానికి స్థలాలను గుర్తించాలన్నారు.

English summary
V Hanumantha Rao not interested to contest again in direct elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X