కేసీఆర్! సోనియా వద్దకి రా, హైద్రాబాద్‌లో కాదు: విహెచ్

VH suggests KCR lead team to Sonia Gandhi
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలన్న చిత్తశుద్ది ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాద్‌లో ఉండి ప్రకటనలు చేయడం మాని, వెంటనే ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు అన్ని పార్టీల నేతల్ని కలుసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, వి హనుమంత రావు, రాపోలు ఆనంద భాస్కర్‌, ఎంఎ ఖాన్‌ డిమాండ్‌ చేశారు.

సోమవారం రాజ్యసభకు పోలవరం బిల్లు రావడం లేదని మరో రెండు రోజుల తర్వాత వస్తుందని, ఈ లోపు కేంద్రంలో వివిధ పార్టీల నేతలను కలిసి ఒత్తిడి పెంచాలని వారు కేసీఆర్‌కు సూచించారు. కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఉండి బంద్‌లు జరిపిస్తే ఇక్కడ ఎవరూ పట్టించుకోరన్నారు. ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో వారు మాట్లాడారు.

పోలవరం బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులందరం వ్యతిరేకిస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హన్మంత రావు ఇందుకోసం సీపీఐ, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మద్దతు కూడగడతామని చెప్పారు.

పార్లమెంటులో పోలవరం బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశపెట్టి ఆమోదించిందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. ఇప్పటికైనా పోలవరం బిల్లును రాజ్యసభలో నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు పేరుతో కుట్ర పన్ని సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ భూభాగాన్ని ఆక్రమించుకుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే టి జీవన్‌రెడ్డి కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో తెలంగాణలో ఖనిజ సంపదను, సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును, 5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఇందిరాసాగర్‌ ప్రాజెక్ట్‌ను కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లాక్కుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+