'ఢిల్లీలో హింసకు కుట్ర': యూటికి నో, ఎంపీ తీన్‌మార్

దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లకు కుట్ర జరుగుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నుండి రైళ్లలు పెద్ద ఎత్తున గూండాలను తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. సీమాంధ్ర నుంచి వెళ్లే రైళ్లను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఖమ్మంలో మాట్లాడారు.
సీమాంద్రులు పెద్దఎత్తున తరలివెళ్తే ఢిల్లీలో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందని బిజెపి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. సీమాంద్రులను సాకుగా చూపి తెలంగాణ బిల్లును కాంగ్రెస్ పక్కనపెట్టాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
హైదరాబాదును లూటీ చేసేందుకే కేంద్రపాలిత ప్రాంతం ఎంపి అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాదులో అన్నారు. సీమాంధ్ర నాయకులు చెబుతున్నట్లుగా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. సీమాంధ్ర వ్యాపారులంతా ప్రభుత్వాలతో కుమ్మక్కై నామమాత్రపు ధర ఎకరాలకు ఎకరాలు తీసుకొని అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలు, అపోలో ఆసుపత్రులు నిర్మించుకున్నారని మండిపడ్డారు. అధి అభివృద్ధి కాదని, సీమాంధ్ర నాయకుల వల్ల భూములు లూటీ అయ్యాయన్నారు. లక్షల రూపాయల భూమిని చవకగా కొన్నారన్నారు. కాగా, బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టిందంటూ అంజన్ తీన్‌మార్ స్టెప్పులేశారు.












Click it and Unblock the Notifications