వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు పెళ్లిళ్ల మాటేంటి: పవన్‌పై విహెచ్ ఘాటు వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

VHR questions KCR's claim on Telangana
హైదరాబాద్: సినీ నటుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై మహిళలు ప్రశ్నిస్తున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు శనివారం అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదని చెప్పారు. మహిళల్లో ఎంతో సామాజిక చైతన్యం వచ్చిందన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చునని చెప్పారు. అయితే సమాజంలో ఉండే ఉన్నత వ్యక్తులు, వారి వ్యక్తిత్వం, జీవనం ప్రజలకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. ప్రజల్లో వారి పట్ల విశ్వసనీయత ఉండాలన్నారు. మహిళలను గౌరవించాలని, నీతి, నిజాయితీ ఎంతో ముఖ్యమన్నారు.

పవన్ కల్యాణ్ పార్టీని ప్రజలు ఎంత వరకు ఆదరిస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కాంగ్రెసు ముఖ్యమంత్రి అభ్యర్థఇగా తన పేరు ప్రచారంలో ఉందన్న వార్తలపై విహెచ్ స్పందిస్తూ... పార్టీ అధ్యక్షురాలు సోనియా సూచనల మేరకు నడుచుకుంటానని చెప్పారు. అంబర్ పేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే చూద్దామన్నారు.

కాగా, పొత్తులతో వేసిన కమిటీతో చర్చించకుండా తెరాస అధినేత కెసిఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని, సిఎం అవ్వాలనే ధ్యేయంతోనే అలా వ్యవహరిస్తున్నాడని విహెచ్ మెదక్ జిల్లాలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం అమరుల త్యాగమేనని, మరెవరూ కాదని ఆయన స్పష్టం చేశారు.

English summary
V Hanumantha Rao questions KCR's claim on Telangana, asks if it's possible to get stathood with two MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X