బెజవాడ మున్సిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు

పదేళ్ళ క్రితం జగన్మోహనరావు అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై పదేళ్లు విచారణ జరిగింది. ఆ వ్యక్తికి న్యాయం చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2000లో జగన్మోహనరావు అనే వ్యక్తికి చెందిన 200 గజాల స్థలాన్ని అతని అనుమతి లేకుండా మున్సిపల్ అధికారులు అక్రమంగా తీసుకుని అందులో డ్రైనేజ్, రోడ్లు వేయించారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ జగన్మోహనరావు కోర్టును ఆశ్రయించారు.
మున్సిపల్ అధికారులు కూడా జిల్లా కోర్టులో అపీల్ వేశారు. అయినా ఓడిపాయారు. చివరికి తీర్పు జగన్మోహనరావుకు అనుకూలంగా వచ్చింది. దాన్ని ఎగ్జిక్యూటీవ్ చేయాలని 2009లోనే పిటిషన్ వేశామని, అప్పటి నుంచి అధికారులు కోర్టుకు వస్తున్నారు తప్పితే కోర్టు తీర్పును అమలు చేయడం లేదు.
దీనిపై మెట్రోపోలిటన్ సెషన్స్ కోర్టు జగన్మోహనరావుకు సోమవారం అనుకూలంగా తీర్పు ఇస్తూ, ఆయన స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారో వాటిని తొలగించి, ఆయన స్థలం ఆయనకు ఇవ్వాలని ఆదేశిస్తూ, కోర్టు తీర్పును నిర్లక్ష్యం చేసినందుకు నగర మున్సిపల్ కమిషనర్‌ను 30 రోజుల పాటు సివిల్ జైలు శిక్షను అనుభవించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.












Click it and Unblock the Notifications