మంత్రి పదవికి వెంకయ్య రాజీనామా, ఉపరాష్ట్రపతిగా మూడో తెలుగో వ్యక్తి!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పదవికి సోమవారం రాత్రిపూట వెంకయ్యనాయుడు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు మంగళవారంనాడు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైతే ఆ పదవికి ఎన్నికైన మూడో తెలుగువాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

వాగ్దాటికి వెంకయ్య మారుపేరు, లోటేనన్న బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడిని ఎన్‌డిఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది బిజెపి. ఈ మేరకు ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడ తమ ఆమోదాన్ని తెలిపాయి.

అయితే కేంద్రమంత్రి పదవికి వెంకయ్యనాయుడు సోమవారం రాత్రిపూట రాజీనామా సమర్పించారు.బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహ, పలువురు కేంద్రమంత్రులు, బిజెపి సీనియర్లు వెంకయ్యనాయుడును అభినందించారు.

5 కి.మీ. నడక, ఇందిరాగాంధీ ప్రచారం చేసినా గెలిచిన వెంకయ్య

ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ముందే ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయాల్సి ఉన్న కారణంగానే ఆయన రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చెబతున్నాయి.

ఎన్నిక లాంఛనమేనా?

ఎన్నిక లాంఛనమేనా?

ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు ఎన్నిక లాంఛనమేననే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ తరపున గోపాలకృష్ణగాంధీని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. అయితే వ్యూహత్మకంగానే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. అయితే బిజెపి మాత్రం నామినేషన్లకు ఒకరోజు ముందుగా అభ్యర్థిని ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని బిజెపి ప్రకటించింది. వ్యూహాత్మకంగానే వెంకయ్యపేరును బిజెపి ప్రకటించిందనే అభిప్రాయం ఉంది. ఎన్‌డిఏకే బలం ఎక్కువగా ఉన్నందున రాష్ట్రపతి ఎన్నికల్లో వచ్చే ఫలితమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడ పునరావృతమయ్యే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

Venkaiah Naidu maybe named as BJP's Vice-presidential candidate | Oneindia News
మూడో తెలుగువ్యక్తి

మూడో తెలుగువ్యక్తి


భారత ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించిన మూడో వ్యక్తిగా వెంకయ్యనాయుడు చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే ఇద్దరు తెలుగువారు ఈ పదవిని చేపట్టారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, ఆ తర్వాత ఈ పదవిని అలంకరించే మూడో వ్యక్తిగా వెంకయ్యనాయుడు చరిత్రలో నిలిచిపోనున్నారు.

ఉపరాష్ట్రపతుల నుండి రాష్ట్రపతులుగా

ఉపరాష్ట్రపతుల నుండి రాష్ట్రపతులుగా

సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. మరోదఫా కూడ ఆయన ఈ పదవిలో ఉన్నారు ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. 1967లో వరాహగిరి వెంకటగిరి (వివిగిరి) ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. వీరిద్దరూ కూడ ఉపరాష్ట్రపతులుగా పోటీచేసి చివరకు రాష్ట్రపతులుగా కూడ పనిచేశారు.

 వెంకయ్యకు పవన్ శుభాకాంక్షలు

వెంకయ్యకు పవన్ శుభాకాంక్షలు

ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడును ఎంపిక చేయడం పట్ల జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ స్పందించారు. ఆయనకు జనసేన తరపున శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ రాజకీయనాయకుడిగా అపార అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి వన్నెతెస్తారని విశ్వసిస్తున్నట్టు పవన్ చెప్పారు. తెలుగువారంతా గర్వించదగిన పరిణామమన్నారు. తెలుగువారికి దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నట్టు చెప్పారు పవన్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader M Venkaiah Naidu, who has been nominated as the vice-presidential candidate of the ruling NDA alliance, resigned from his post as Union minister in the Narendra Modi cabinet,
Please Wait while comments are loading...