పట్టాభితో బూతు డ్రామా -కుప్పంలో బాంబు డ్రామా : చంద్రబాబు పై సాయిరెడ్డి - రోజా ఫైర్..!!
కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి...ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు సానుభూతి రాజకీయాలకు తెరలేపారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 'అన్ని ఎన్నికల్లో ఓడి తలబొప్పి కట్టడంతో సానుభూతి కోసం కుప్పంలో వీధి నాటకాలకు తెరతీశారని ఫైర్ అయ్యారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులు చేయించాడు. తనపైనే ఎవరో దాడి చేస్తున్నట్లు నిద్దట్లో కలవరిస్తూ ఆ ఫస్ట్రేషన్ జనంపై చూపిస్తున్నాడు. ఏంటి బాబు ఈ డ్రామాలు... ఓట్ల కోసం ఈ పాట్లు' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ ఫ్రస్టేషన్‌లో నగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. 'యధా రాజా తథా చంద్రబాబు' అన్నది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకే సరిపోతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.

కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి ఈ రోజు ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదమన్నారు. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని పిలుస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన సవాల్ పైన సీరియస్ గా స్పందించారు.
గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ కే పట్టం కడతారనే విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే చరిత్ర హీనుడిగా మిగిలి పోతారంటూ రోజా హెచ్చరించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications