Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పబ్లిసిటీ జిమ్మిక్కుల మీద ఇంకా ఎన్నాళ్లు బతకుతావు లోకేశం? సాయి రెడ్డి ప్రశ్న, వాసిరెడ్డి పద్మ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా కాకానిలో పట్టపగలు నడిరోడ్డుమీద బీటెక్ విద్యార్థిని రమ్యను ప్రేమోన్మాది అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు రక్షణ లేదని, దిశ చట్టాన్ని తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంటున్న వైసిపి ఆ చట్టం ద్వారా ఇప్పటి వరకు ఎవరిని శిక్షించ లేకపోయిందని, యువతులపై, అత్యాచారాలు హత్యలు పెరుగుతున్నా గన్ కంటే ముందు వస్తాడు అని చెప్పిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు కూడా రావడం లేదని తెలుగుదేశం పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.

500 కుటుంబాలకు న్యాయం జరిగే వరకు 500 సార్లైనా జైలుకు వెళతానన్న లోకేష్

500 కుటుంబాలకు న్యాయం జరిగే వరకు 500 సార్లైనా జైలుకు వెళతానన్న లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వ్యవహారంలో బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా దళిత బిడ్డ రమ్య హంతకుడిని శిక్షించే వరకు తన పోరాటం ఆగదని 500 కుటుంబాలకు న్యాయం జరిగే వరకు 500 సార్లైనా తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

అంతేకాదు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. దళిత కుటుంబానికి అండగా నిలబడి పోరాటం చేస్తున్నందుకు తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించి జైలుకు పంపేందుకు ప్రయత్నిస్తారా అంటూ ప్రశ్నించిన నారా లోకేష్ అదే తన నేరమైతే ఐపీసీ లో ఉన్న అన్ని సెక్షన్లు పెట్టుకోండి, రాష్ట్రంలో అన్యాయం అయిపోయిన మహిళల పక్షాన వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేసి తీరుతామని అంటూ వెల్లడించారు.

శవరాజకీయాలు చేస్తున్నాడని లోకేష్ పై వైసీపీ ధ్వజం

శవరాజకీయాలు చేస్తున్నాడని లోకేష్ పై వైసీపీ ధ్వజం

రమ్య హత్యకేసును తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారని, లోకేశ్ శవ రాజకీయాలు చేస్తూ, శవాల దగ్గర రాబందులా వాలి పోతున్నాడు అంటూ వైసీపీ నేతలు విమర్శించారు. ప్రభుత్వం హత్య జరిగిన తరువాత 12 గంటల లోపే నిందితుడు పట్టుకుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఏపీ మంత్రులు చెబుతున్నారు. ఇక తాజాగా లోకేష్ ను టార్గెట్ చేసిన విజయ సాయి రెడ్డి పబ్లిసిటీ గిమ్మిక్కులు మీద ఇంకా ఎన్నాళ్లు బ్రతుకుతాం లోకేశం అంటూ నారా లోకేష్ ను ఎద్దేవా చేశారు. ఇంట్లో చేతులు నలుపుకుంటూ కూర్చున్నా రోజంతా మీ ఎల్లో టీవీలలో లైవ్ పెట్టి చూపిస్తాయని విమర్శించారు.

నువ్వో సంస్కార హీనుడివి అంటూ టార్గెట్ చేసిన సాయిరెడ్డి

నువ్వో సంస్కార హీనుడివి అంటూ టార్గెట్ చేసిన సాయిరెడ్డి

ఇక ఇంత దూరం వచ్చి ఏం సాధించినట్టు అంటూ ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళకే ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. ఇక నువ్వో వెలిసిపోయిన జెండావి, సంస్కారహీనుడివి అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. ఇక ఇదే సమయంలో రమ్య హత్య కేసు విషయంలో రాద్ధాంతం చేయడం కావాలని మనబడి, నాడు నేడు కార్యక్రమాలపై ప్రజల దృష్టి మరల్చేందుకేనంటూ విమర్శించారు.

రమ్య హత్య రచ్చ అందుకే .. స్కూళ్ళు చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నారు

రమ్య హత్య రచ్చ అందుకే .. స్కూళ్ళు చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నారు

దాదాపు 16 వేల ప్రభుత్వ స్కూళ్లను సకల హంగులతో ఆధునీకరించి పిల్లలకు అంకితం చేసే కార్యక్రమం జరుగుతుంటే కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తండ్రీకొడుకులు అంటూ విజయ సాయి రెడ్డి విమర్శించారు. జనం దృష్టి మళ్లించడానికి ఆడిన నాటకం బెడిసికొట్టడంతో, పూర్తిగా దిగజారి పోయారని నిప్పులు చెరిగారు. రమ్య హత్యపై ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న రచ్చ కేవలం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు తెలియకుండా చేయడం కోసమేనని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Recommended Video

    pcc chief Revanth Reddy speech at minority garjana | Oneindia Telugu
    లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు : వాసిరెడ్డి పద్మ

    లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు : వాసిరెడ్డి పద్మ

    విజయసాయిరెడ్డి మాత్రమే కాదు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో టీడీపీ రాజకీయం చేస్తోందని ఆమె విమర్శించారు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించిన వాసిరెడ్డి పద్మ, నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు అంటూ ద్వజమెత్తారు.

    మహిళల రక్షణ కోసం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకు వచ్చారని గుర్తు చేశారు. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+