బాబులాంటి వారు వేలమంది వచ్చినా: విజయసాయి తీవ్రవ్యాఖ్యలు, 'బీజేపీలో మార్పు రావాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

'చంద్రబాబుకు చెంపపెట్టు, అందరూ రాజీనామా చేయాలి, 21న కలిసిరండి'

చంద్రబాబు నాయుడు అభద్రతా భావంతో ఉన్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన వైఫల్యం చెందారని విమర్శించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏ ఒక్క పనిని చేయించలేకపోయిందన్నారు.

చంద్రబాబు లాంటి వ్యక్తులు వేలమంది వచ్చినా

చంద్రబాబు లాంటి వ్యక్తులు వేలమంది వచ్చినా

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు వేలమంది తమకు ఎదురుపడ్డా భయపడమన్నారు. హోదా సాధించే వరకు ముందుకు సాగుతామన్నారు.

 చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు క్యారెక్టర్ లేదని, ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, అందుకే, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని విజయ సాయి రెడ్డి అన్నారు.

 పోరాటం ఆగదు

పోరాటం ఆగదు

కేంద్రంతో లాలూచీ పడటం, ఒప్పందం చేసుకోవడం వంటివి తాము చేయలేదని, తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నామని విజయ సాయి రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పోరాటం ఆగదన్నారు.

 బీజేపీలో మార్పు రావాలి

బీజేపీలో మార్పు రావాలి

ఏపీతో తమకు పని లేదని, యూపీ ఉందని బీజేపీ అనుకుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం పొరుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమైందని, బీజేపీకి ఈ ఓటమి గుణపాఠమన్నారు. బీజేపీలో మార్పు రావాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party Rajya Sabha MP Vijaya Sai Reddy on Wednesday Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి