కొత్త ఫిటింగ్ పెట్టిన సాయిరెడ్డి..!!
Air India: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి.. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నప్పటికీ- ఆయన మనసు మాత్రం అటే లాగుతున్నట్టే కనిపిస్తోంది. రాజకీయాల్లోెకి రాదలచుకుంటే తనను ఎవరూ ఆపలేరంటూ గతంలో వ్యాఖ్యానించిన రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాల గురించి ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే వస్తోన్నారు.
తాజాగా ఎయిర్ ఇండియా ఎదుర్కొంటోన్న విపత్కర పరిణామాలపై విజయసాయి రెడ్డి స్పందించారు. ఎయిర్ ఇండియాలో ఇండియా అనే పదం ఇంకా కొనసాగుతోండటం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే ఓ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రైవేటీకరణ అనంతరం చోటు చేసుకుంటోన్న భద్రత లోపాలపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రైవేటీకరణ తరువాత కూడా ఎయిర్ ఇండియా పేరులో ఇండియా అనే పదం వాడకం ఎంతమాత్రం సరికాదని తేల్చి చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం వంటి భద్రతా లోపాలను ఆయన ప్రస్తావించారు.
ప్రైవేటీకరణ తర్వాత కొత్త యాజమాన్యం కింద ఎయిర్‌లైన్ పర్యవేక్షణపై సాయిరెడ్డి అనేక అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత వరకూ ఎయిర్ ఇండియాలో ఇండియా అనే పదం పట్ల ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదని, ఇప్పుడు ఆ సంస్థ యాజమాన్యం అనుసరిస్తోన్న తీరు వల్ల ఇండియాకు చెడ్డ పేరు వస్తోందని అన్నారు.
ఎయిర్ ఇండియాలో ఇండియా పేరును తొలగించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ పెట్టారు. దీన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ట్యాగ్ చేశారు.
అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ఉన్నారు. ఈ విమానం జేబీ మెడికల్ కాలేజీ మీద పడటం వల్ల పలువురు వైద్య విద్యార్థులూ తీవ్ర గాయాలపాలయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబై చేరకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓ ఇంజిన్ లో లోపం ఏర్పడినట్లు పైలెట్లు సకాలంలో గుర్తించగలిగారు. దీనితో విమానాన్ని కోల్ కత ఎయిర్ పోర్ట్ లో నిలిపివేశారు. ప్రయాణివకులందరినీ కిందికి దించివేశారు. ఫలితంగా పెను ముప్పు తప్పినట్టయింది.
మొన్నటికి మొన్న జైపూర్ నుండి దుబాయ్ ఎయిరిండియా ఐఎక్స్ 196 విమానంలో ప్రయాణికులు సుమారు ఐదు గంటల పాటు నరకం అనుభవించిన విషయం తెలిసిందే. విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడం వారికి చుక్కలు చూపించింది. సిబ్బంది నుంచి సరైన స్పందన సైతం లేకపోవడంతో ప్రయాణికులను మరింత ఆగ్రహోదగ్రులను చేసింది.












Click it and Unblock the Notifications