• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మై డియర్ బోకేష్.. ఎలకేష్.. ఓరినీ అయ్య...న్న.. వెధవ: సాయిరెడ్డి తిట్లదండకం

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలపై తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. నిత్యం పొలిటికల్ మిర్చి, నాకౌట్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేష్, అయ్యన్నపాత్రుడు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు .

పప్పుకు ‘ఆనం’ ఎవరో ‘గానం' ఎవరో తెలియదు: వైసీపీ ఎంపీ

పప్పుకు ‘ఆనం’ ఎవరో ‘గానం' ఎవరో తెలియదు: వైసీపీ ఎంపీ

ఎవరైనా నేతలు కలుస్తామని బతిమాలితే లోకేశ్ దగ్గరికి వెళ్లమంటున్నాడట బాబు అంటూ ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి లోకేష్ ను కలిసిన విషయంపై ప్రస్తావించిన విజయ సాయి రెడ్డి చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేశారు. పప్పుకు 'ఆనం' ఎవరో 'గానం' ఎవరో తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. పరిచయం చేసుకుంటేగాని గుర్తించలేడు అని సెటైర్లు వేశారు. మహానాడు తర్వాత అన్నీ లోకేశే చూస్తాడని సంకేతాలిచ్చాడు చంద్రబాబు అంటూ పేర్కొన్నారు. వయసు పైబడింది. చీకటి ముసరక ముందే కొడుకును ఏదైనా చేయాలని బాబుఆరాటం. పాపం! అంటూ చంద్రబాబు పై అసహనం తో కూడిన జాలిని ప్రదర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

ఎమ్మారై మెషిన్‌లో పెడితే నీకున్న బ్రెయిన్‌ ఆవగింజంత: సాయిరెడ్డి

ఎమ్మారై మెషిన్‌లో పెడితే నీకున్న బ్రెయిన్‌ ఆవగింజంత: సాయిరెడ్డి


అంతేకాదు పొలిటికల్ మిర్చి అంటూ గూగుల్ మ్యాప్ లో అవినీతి బయటకు తీసి చూపిస్తానని చంద్రబాబు మాట్లాడినట్టు, టైర్లలో గ్యాస్ తీసిన నన్ను ఆపలేరు అంటూ లోకేష్ మాట్లాడినట్టు పేర్కొన్న విజయసాయిరెడ్డి సరిపోయారు ఇద్దరికిద్దరూ అంటూ సెటైర్లు వేశారు. ఇక ఇదే సమయంలో లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి మై డియర్‌ బోకేష్‌! అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎమ్మారై మెషిన్‌లో పెడితే నీకున్న బ్రెయిన్‌ ఆవగింజంత... స్కానింగ్‌ను ముందుకు కదుపుదాం అంటే మిగతాది సీమ పంది అంత! అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నీ బతుకే ఖావోస్‌... దావోస్‌ గురించి నీకెందుకు చెప్పు?మేసింది చాలు... మూసుకు కూర్చో! అంటూ తిట్టిపోశారు.

ఎదర ఎలకకి ఉన్నంత... వెనక ఏనుగుకున్నంత! ఇదీ నీ సిస్టమ్‌: లోకేష్ పై ఫైర్

ఎదర ఎలకకి ఉన్నంత... వెనక ఏనుగుకున్నంత! ఇదీ నీ సిస్టమ్‌: లోకేష్ పై ఫైర్

మై డియర్‌ ఎలకేష్‌! నీ ఫ్రస్ట్రేషన్‌ నాకు అర్థం అయ్యింది. ఎదర ఎలకకి ఉన్నంత... వెనక ఏనుగుకున్నంత! ఇదీ నీ సిస్టమ్‌! పైగా నీ వాయిస్‌ నిండా పొగ గొట్టం లేని కిరసనాయిల్‌ కారు సౌండే. దీనికి మమ్మల్ని తిట్టి ఏం ప్రయోజనం? కొన్నికొన్ని మారవు బాబూ! అంటూ మరో పోస్ట్ లో ఘాటుగా విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. ఇక అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఓరినీ అయ్య...న్న! నిన్ను సృష్టించేటప్పుడే దేవుడు నీకు అన్నం తినేది కింద, అశుద్ధం పేగు పైన పెట్టాడు. కాబట్టే నువ్వు ఏం మాట్లాడినా నీ కంపునోటినిండా పెంటపెంటే! అంటూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.

అయ్యన్నపాత్రుడిని కుక్కతో పోల్చి ఘాటుగా తిట్టిన సాయిరెడ్డి

అయ్యన్నపాత్రుడిని కుక్కతో పోల్చి ఘాటుగా తిట్టిన సాయిరెడ్డి

అంతేకాదు అయ్యన్నపాత్రుడు ను కుక్క తో పోల్చి నోటికొచ్చినట్టు తిట్టారు. కుక్క రోడ్డుమీద మొరుగుతుంది. వీడు కెమెరా ముందు మొరుగుతాడు. కుక్క గంజి తాగుతుంది- వీడు గంజాయి తాగుతాడు. కుక్క పాలో నీళ్ళో తాగుతుంది. వీడు నాటు సారా తాగుతాడు. కుక్క- వీడు ఒకటే తింటారు! అంటూ అయ్యన్నపాత్రుడు ని కుక్క తో పోల్చి అడ్డమైన తిట్లు తిట్టారు. ఇలాంటి వెధవనోట మంచి మాటలు ఎందుకు వస్తాయి? అంటూ విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.

English summary
After Mahanadu, YCP MP Vijayasai Reddy increased the dose and insulted Chandrababu, Lokesh and ayyanna patrudu. Lokesh was badly targeted by sai reddy with his words.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X