జగన్ కు నమ్మక ద్రోహం చేయను, సజ్జల నా పై భౌతిక దాడి చేస్తే - సాయిరెడ్డి సంచలనం..!!

విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కొత్త పార్టీ ఏర్పాటు కు సిద్దం అవుతున్న సాయి రెడ్డి తాను జగన్ కు ద్రోహం చేస్తున్నట్లు వస్తున్న విమర్శల పైన స్పందించారు. తాను జగన్ కు నమ్మకం ద్రోహం చేయలేదని.. చేయనని స్పష్టం చేసారు. అదే సమయంలో సజ్జల నాడు కాంగ్రెస్ తో, నేడు టీడీపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. సజ్జల తన పైన డైరెక్టుగా భౌతికంగా దాడి చేస్తే.. జగన్ కు తెలిసి ప్రేక్షక పాత్ర వహించారని వ్యాఖ్యానించారు.

వైసీపీ మాజీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి బహిరంగ లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్‌కు తాను ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదని, నమ్మకద్రోహమే తన రక్తంలో ఉంటే ఎప్పుడో పార్టీ మారిపోయేవాడినని ఆయన పేర్కొన్నారు. జగన్‌గారికి నమ్మకస్తుడిననే కారణంతోనే అనేక కేసుల్లో తనను నిందితుడిగా చేర్చారని తెలిపారు. 2020 తర్వాత తనపై పార్టీలో క్రమంగా కుట్రలు, అవమానాలు పెరిగాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని పేర్కొన్నారు. "నేను ఎప్పుడూ కోటరీలో లేను. జగన్‌ దృష్టిలో నా మాటకు ఉన్న విలువను 2020 నుంచి అంచెలంచెలుగా తగ్గించింది ఎవరు?" అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులకు సైతం జగన్‌ను కలవకుండా అడ్డుకున్నది సజ్జలేనని ఆరోపించారు.

 మూడ్ ఆఫ్ ఏపీ: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, గెలుపు ఎక్కడ - వారికి డేంజర్ బెల్స్, బిగ్ ఛేంజ్...!!
మూడ్ ఆఫ్ ఏపీ: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, గెలుపు ఎక్కడ - వారికి డేంజర్ బెల్స్, బిగ్ ఛేంజ్...!!
vijayasai-reddy-s-open-letter-sensational-allegations-against-sajjala-says-he-won-t-betray-jagan

సజ్జల లక్ష్యంగా తీవ్ర విమర్శలు

సజ్జల లాగా కాంగ్రెస్ తో సంధి చేసుకొని ఈడీ ఛార్జ్ షీట్ లో పేరు లేకుండా చేసుకోలేదని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు సజ్జల ఆధ్వర్యంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిపై కార్యకర్తలు, జగన్ అభిమానులు ఆలోచించాలని ఆయన కోరారు. తాను పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు వేరే పార్టీ పెడుతున్నానని విజయసాయిరెడ్డి తన లేఖలో వెల్లడించారు. మంగళగిరిలో 2022 లో జరిగిన ప్లీనరీలో తన పై డైరెక్టుగా.. భౌతికంగా దాడి చేస్తే జగన్ కు తెలిసి మౌనంగా ఉన్నారని.. పార్టీలోనూ అందరికీ ఈ విషయం తెలుసని చెప్పుకొచ్చారు. మిగిలిన నేతల్లాగా సజ్జలకు సాష్టాంగ నమస్కారాలు తాను చేయలేనని.. తన ఆత్మ గౌరవం దెబ్బ తినే విధంగా ఉండలేక... తాను పార్టీ వీడానని స్పష్టం చేసారు. ఈ కారణంతోనే పార్టీ గుర్తు మీద వచ్చిన రాజ్యసభకు రాజీనామా చేసానని చెప్పారు. తాను జగన్ కు నమ్మక ద్రోహం చేయలేదని ఆయన అభిమానులు గుర్తించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+