ఆ గల్ఫ్ వీసా భారత్ ను ముంచేస్తుందా ? కేంద్రం జోక్యం కోరిన సాయిరెడ్డి..!
ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ, తాజాగా రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి.. ఈ మధ్య ఎక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రాజకీయాలు కాకుండా మిగతా అన్ని అంశాలపై ఆయన ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో చాలా వరకూ జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక అంశాలపైనే ఉంటున్నాయి. సమాజంలో పలు సమస్యల్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని వాటికి పరిష్కారాలు చేపట్టేలా అలర్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా సాయిరెడ్డి మరో ట్వీట్ చేసారు.
ఇంతకీ విషయానికొస్తే.. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (అరబ్ దేశాల సమాఖ్య) గతంలోలా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండానే తమ దేశ పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తోంది. కేవలం రూ.23.3 లక్షల రూపాయలు కడితే భారత్, బంగ్లాదేశ్ పౌరులకు గోల్డెన్ వీసా ఇస్తామని ప్రకటించింది. వీరు అరబ్ పౌరుల్లా అక్కడ శాశ్వతంగా నివసించడానికి, పని మనుషుల్ని నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఈ గోల్డెన్ వీసా భారతీయులకు ఎంతో ఉపయోగపడనుంది.

UAE’s new Golden Visa offered with no investment & just ₹23.3 lakh in fees poses a real threat to India’s economy. It risks accelerating skilled migration and creating talent vacuums in sunrise sectors. The govt must act to ensure our brightest minds choose to build in India. No…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 7, 2025
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ గోల్డెన్ వీసాపై స్పందించారు. ఎటువంటి పెట్టుబడి లేకుండా & కేవలం ₹23.3 లక్షల రుసుముతో యూఏఈ అందించే కొత్త గోల్డెన్ వీసా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన ముప్పుగా పరిణమిస్తుందని సాయిరెడ్డి ఆరోపించారు. ఇది నైపుణ్యం కలిగిన వలసలను వేగవంతం చేసే ప్రమాదం ఉందని, సూర్యోదయ రంగాలలో ప్రతిభ శూన్యతను సృష్టించే ప్రమాదం ఉందన్నారు. మన తెలివైన మనస్సులు భారతదేశంలో నిర్మించాలని ఎంచుకునేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నారు. ఏ భారతీయుడు కూడా ఇష్టానుసారంగా మన దేశాన్ని వదిలి వెళ్లాలనుకోడని తెలిపారు.












Click it and Unblock the Notifications