డ్రగ్స్ అన్నావ్, బ్రెజిల్ అన్నావ్-ఇప్పుడేం చెప్తావ్ ? చంద్రబాబుకు సాయిరెడ్డి ప్రశ్న..!

ఏపీలో గత ఎన్నికలకు ముందు విశాఖ పట్నం పోర్టులో భారీ ఎత్తున డ్రై ఈస్ట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని డ్రగ్స్ గా పేర్కొంటూ అప్పట్లో విపక్షంలో ఉన్న కూటమి నేతలు భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఇందులో చంద్రబాబు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో సీబీఐ దీనిపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై పురోగతి లేకపోవడంతో తాజాగా పవన్ కళ్యాణ్, జగన్ కూడా వైజాగ్ డ్రగ్స్ వ్యవహారం తేల్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. దీంతో సీబీఐ తాజాగా దీనిపై స్పందించింది.

అప్పట్లో వైజాగ్ పోర్టులో దొరికింది డ్రగ్స్ కాదని సీబీఐ తాజాగా తేల్చేసింది. దీంతో అప్పట్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా డ్రగ్స్ అంటూ ప్రచారం చేశారని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అప్పట్లో విజయసాయిరెడ్డిని డ్రగ్స్ కు లింక్ చేస్తూ ప్రచారం చేసిన చంద్రబాబును ఇప్పుడు ఆయన టార్గెట్ చేశారు. సీబీఐ క్లీన్ చిట్ నేపథ్యంలో ఇప్పుడేం సమాధానం చెప్తావ్ చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు.

vijayasai reddy sought cm Chandrababu s reply to vizag port drugs propaganda in elections


చంద్రబాబు కుట్ర రాజకీయల్లో భాగంగా విశాఖ కంటైనర్ లో వెయ్యి టన్నుల డ్రగ్స్ దొరికిందని, రాష్ట్రం గంజాయి, డగ్స్ అడ్డాగా మారిపోయిందని, ఓటర్లను మోసగించేందుకు పోలింగ్ కు నెలన్నర ముందు పెద్దఎత్తున దుష్ప్రచారం చేశారని సాయిరెడ్డి ట్వీట్ లో ఆరోపించారు. ఇప్పుడు ఆ కంటైనర్ లో డ్రగ్స్ లేవని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ ప్రకటించిందన్నారు.
బ్రెజిల్ అధ్యక్షుడికీ తనకూ లింకు పెట్టి మరీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, అతని పచ్చకుల మీడియా ఇప్పుడు ఏం సమాదానం చెప్తారు? అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+