
Vijaya Sai Reddy : రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి ప్రమాణం- జగన్, భారతికి థ్యాంక్స్
ఏపీలో వైసీపీలో సీఎం జగన్ తర్వాత నంబర్ టూగా పరిగణించే కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి వరుసగా రెండోసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా వైసీపీ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన వరుసెగా రెండోసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టినట్లయింది.
ఇవాళ ఉదయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే వైసీపీ సహా పలు పార్టీల ఎంపీలు ప్రమాణస్వీకారాలు నిర్వహించారు. ఇందులో వైసీపీ ఎంపీగా విజయసాయిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వైసీపీ తరఫున గతంలో ఓసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన సాయిరెడ్డి... రెండోసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు ఎంపీలుగా ఎన్నికైన ఇతరులు కూడా ప్రమాణస్వీకారాలు చేస్తున్నారు. ఈ సందర్భఁగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనను ఎంపీగా అవకాశం కల్పించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

వైసీపీ తరఫున రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్ తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతికి ధన్యవాదాలు తెలుపుతూ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏపీ నుంచి మరోసారి నన్ను రాజ్యసభ సభ్యుడిని చేసిన గౌరవ సీఎం వైఎస్ జగన్ గారికి, శ్రీమతి వైఎస్ భారతమ్మ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై నా బాధ్యతలను మరింత అంకిత భావంతో నిర్వర్తిస్తానని తెలియచేస్తున్నా అంటూ సాయిరెడ్డి ట్వీట్ ముగించారు.
రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏపీ నుంచి నన్ను మరోసారి రాజ్యసభ సభ్యుడిని చేసిన గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి, శ్రీమతి వైఎస్ భారతమ్మ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై నా బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నా. pic.twitter.com/O3LFNhpRhd
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 18, 2022