• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్వీట్ల‌తో రెచ్చి పోతున్న విజ‌య‌సాయి రెడ్డి..! ఇంత‌కీ ఇస్తున్న సందేశం ఏంటి..?

|

హైద‌రాబాద్: లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతున్న‌ప్పుడు అంతే స్థాయి పార్టీతో చేతులు క‌లిపి కేంద్రానికి గుణ‌పాఠం చెప్ప‌డంలో ఎలాంటి పొర‌పాటు లేద‌ని ఏపి ప్ర‌జానికం భావిస్తోంది. రాజ‌కీయ ప్ర‌యోజనాలు కాకుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాలకోసం ఎవ‌రు ప్ర‌య‌త్నించినా స్వాగ‌తిస్త‌మ‌ని ఏపి ప్ర‌జ‌లు అభిప్రాయప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గిన‌ట్లుగా రాజ‌కీయం మార్చుకోవ‌టం త‌ప్పేం కాదని రాజ‌కీయ పెద్ద‌లు అభివ‌ర్ణిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో వైఎస్ఆర్సీపి ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఏపి ప్ర‌భుత్వం పైన, చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి పైన చేస్తున్న ట్విట్ట‌ర్ పోస్టులు వివాదాల‌కు తావివ్వ‌డంతో పాటు ఆంద్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను రెచ్చ‌గొట్టే విదంగా ఉన్నాయంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

బాబు పై విజ‌య‌సాయి వ‌రుస ట్వీట్లు..! ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని టీడిపి విమ‌ర్శ‌..!

బాబు పై విజ‌య‌సాయి వ‌రుస ట్వీట్లు..! ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని టీడిపి విమ‌ర్శ‌..!

ఒక‌ప్పుడు ఎన్టీఆర్ జ‌మానాలో కాంగ్రెస్‌తో పంచాయితీ ఉంది క‌దా అని అదే అంశాన్ని ప‌ట్టుకొని వేలాడ‌టం కంటే మారిన ప‌రిస్థితుల్ని గుర్తించి, ఆశాజ‌న‌క‌మైన భ‌విష్య‌త్తు కోసం చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకోవ‌టం అవ‌స‌ర‌మా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. గ‌తించిన గ‌తం కంటే కూడా, ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ ఇదేమీ ప‌ట్టించుకోని విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలోని విజ‌య‌సాయి లాంటి వారి మాట‌ల్ని వింటూ కోట్లాది మంది ప్ర‌జ‌ల జీవితాల్ని ప‌ణంగా పెట్ట‌టం ఎంత‌మాత్రం స‌మంజ‌సం కాద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముడింద‌దే ప‌ట్రిపేస్ ప‌య‌నిల్లై..! న‌డ‌క్క‌పోదు ఎన్న ఎంద‌దా ముఖ్యం అంటున్న టీడిపి..!!

ఎన్టీఆర్ హ‌యాంలో కాంగ్రెస్ తో ఉన్న శ‌త్రుత్వం పేరుతో, ఇప్పుడు ఆ పార్టీతో క‌లవొద్ద‌న్న వ్యాఖ్య‌లు అర్థం ర‌హిత‌మ‌ని చెప్పొచ్చు. ఈ రోజు ఏపీకి తొలి శ‌త్రువైన మోడీని గ‌ద్దె దించాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకు కాంగ్రెస్ సాయం మిన‌హా మ‌రే అవ‌కాశం లేని వేళ ఆ పార్టీతో క‌లిసి న‌డ‌వ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌టంలో అర్థం లేదు. దీనికి రోషం, పౌరుషం అంటూ సినిమా డైలాగుల్ని వ‌ల్లించ‌కుండా వాస్త‌విక ధోర‌ణిలో ఆంద్ర ప్ర‌జ‌ల‌ భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇదే దారిలో ప‌య‌నిస్తున్నఏపీ సీయం చంద్ర‌బాబు పై వైసీపి విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రిక‌ద‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

 కాంగ్రెస్ తో పొత్తు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కాదు..! రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే అంటున్న చంద్ర‌బాబు..!!

కాంగ్రెస్ తో పొత్తు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కాదు..! రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే అంటున్న చంద్ర‌బాబు..!!

కాంగ్రెస్ తో పొత్తు అంశాన్ని ల‌క్ష్మీపార్వతి వ్య‌క్తి గ‌త జీవితానికి ముడి పెడుతూ వైసీపి ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి పెడుతున్న ట్వీట్ల పై కూడా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇవే ఆరోప‌ణ‌ల‌ను 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్బంగా వైసీపి శ్రేణులు చేస్తే తెలుగుత‌మ్ముళ్లు తిప్పికొట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు కాంగ్రెస్ పార్టీ తో ఉన్న వైరం పేరుతో ఆంధ్రోళ్ల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెట్టేలా అన్న సందేహం ఉద్బ‌విస్తోంది. ఆంద్ర ప్ర‌జ‌ల జీవ‌న విధానం మార్చే క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను త‌ప్సుగా అభివ‌ర్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజ‌య‌సాయి రెడ్డిలాంటి వారి ట్వీట్ల‌ ప‌ట్ల ఏపిలో దుమారం రేగుతోంది.

విజ‌య‌సాయి ట్వీట్ల పై విమ‌ర్శ‌లు..! మోతాదు మించుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు..!!

విజ‌య‌సాయి ట్వీట్ల పై విమ‌ర్శ‌లు..! మోతాదు మించుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు..!!

కాంగ్రెస్ కాళ్ల ద‌గ్గ‌ర ఆత్మ‌గౌర‌వం పెట్టేసి క‌ళ్ల‌కు అద్దుకుంటుంటే, మీ ర‌క్తం మ‌రిగిపోవ‌టం లేదా అంటూ చేసిన ట్వీట్ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీపేలా ఉంద‌నే అభిప్ర‌యాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌జ‌ల యోగ క్షేమాల‌కంటే కూడా కంటే కూడా, వారి భ‌విష్య‌త్తు మీద పార్టీని నిర్మించుకోవ‌డ‌మే రాజ‌కీయ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే విజ‌యసాయిరెడ్డి వంటి వారికి రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని ఏపి టీడిపి నాయ‌కులు చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష పార్టీ చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల ప‌ట్ల కూడా ఏపి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు పిలుపునివ్వ‌డం విశేషం.

lok-sabha-home

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When the central government is discriminating against the state in the deficit budget Combine hands with the party as wellAny people think that there is nothing wrong in center. In this case, YSRCP MP Vijayasai Reddy, There are criticisms that the Twitter posts on Chandrababu's manner of dealing with controversy and the sentiments of Andhra people are provocative.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more