నోబెల్ కావాలంటే ఆ పని చేయ్..! ట్రంప్ కు సాయిరెడ్డి సలహా..!
ఏపీలో ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించి అనంతరం ఆ పార్టీ ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో చురుగ్గా ఉంటున్నారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేయడం, కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకుని ఇతరులకు సలహాలు ఇవ్వడం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్ పెట్టారు.
ఓవైపు ఆపరేషన్ సిందూర్ లో తాము భారత్ పై గెలిచామని చెప్పుకునేందుకు తమ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ ఇవ్వడం, ఇప్పుడు అదే హోదాలో అమెరికాలో పర్యటిస్తూ భారత్ పై అణుదాడి హెచ్చరికలు చేయడం కలకలం రేపుతున్నాయి. తమపై అణుదాడికి దిగితే తాము ఒంటరిగా నష్టపోబోమని, భారత్ తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఆసిమ్ మునీర్ చేసిన హెచ్చరికలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

మరోవైపు రష్యా చమురు కొంటున్నామన్న కారణంతో భారత్ పై 50 శాతం ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భవిష్యత్తులోపాకిస్తాన్ నుంచి చమురు కొనే రోజులు వస్తాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ తో కీలకమైన చమురు ఒప్పందం కూడా చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ ను భారత్ కు పోటీగా బలోపేతం చేసేందుకు ట్రంప్ మద్దతిస్తున్నట్లు అర్ధమవుతోంది. దీనికి కొనసాగింపుగా పాకిస్తాన్ ఆర్మీఛీఫ్ ఆర్మీఛీఫ్ ను ఈ మధ్యకాలంలోనే రెండోసారి పిలిపించి చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలోనే భారత్ పై ఆసిమ్ మునీర్ అవాకులు చవాకులు పేలాడు.

Pakistan Army Chief Asim Munir’s reckless talk about taking down half the world with nuclear weapons proves why Pakistan must be disarmed. It’s like a monkey with a gun, dangerous & unpredictable. If @realDonaldTrump truly seeks a Nobel Peace Prize, let him rid Pakistan of nukes.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 11, 2025
ఈ పరిణామాలపై స్పందిస్తూ విజయసాయిరెడ్డి ఇవాళ కీలక ట్వీట్ పెట్టారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడటం ఆ దేశాన్ని ఎందుకు నిరాయుధీకరించాలో రుజువు చేస్తుందని సాయిరెడ్డి తెలిపారు. ఇది తుపాకీ పట్టుకున్న కోతి లాంటిదని, ప్రమాదకరమైనది , ఊహించలేనిది అన్నారు.
ట్రంప్ నిజంగా నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తుంటే, పాకిస్తాన్‌ను అణ్వాయుధాల నుండి విముక్తి చేయనివ్వాలని సూచించారు. అప్పుడు భారతదేశం సంతోషంగా ఆయనను నోబెల్ కు నామినేట్ చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications