జగన్ కు మళ్లీ అధికారంపై సాయిరెడ్డి షాకింగ్- రీఎంట్రీ ఏ పార్టీలో అంటే..!

2009 నుంచి 15 ఏళ్లుగా జగన్ కు ఓ పాలేరులా చిత్తశుద్ధితో, నిజాయితీగా పనిచేశానని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai Reddy) తెలిపారు. చంద్రబాబుపై తాను ఎంతదూరమైనా వెళ్లేలా ఆయన్ను తీసుకెళ్లానన్నారు. దీనికి జగన్ తనకు చేసిన సహాయం కోటరీతో పొగబెట్టి బయటకు పంపడమే అన్నారు. ఓ పాలేరులా పనిచేసిన తానుజగన్ కోసం కష్టపడి పండించిన పంటను , కోటరీలో ఉన్న చాలా మంది సభ్యులు పందికొక్కుల్లా ఈ రోజుకూ తింటున్నారని, జగన్మోహన్ రెడ్డి దాన్ని చూస్తున్నారని తెలిపారు.

ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఎన్ని పాదయాత్రలు చేసినా అవకాశం లేదన్నారు. ఓ రాజకీయ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తనను ఏ రాజకీయ పార్టీలో చేరతారని చాలా మంది అడుగుతున్నారని, తాను ఏ పార్టీలో చేరే అవకాశం లేదని, తన రాజకీయ భవిష్యత్తు ఏంటో స్వయంగా వెల్లడిస్తానన్నారు. తాను ప్రత్యేకంగా పార్టీ పెట్టి చంద్రబాబు సాయం తీసుకుని ఆయనకు ఆర్ధిక భాగస్వామి అవుతానని కొందరు అంటున్నారని, స్వీయ పరిజ్ఞానంతో వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఇలాంటి ప్రచారాలు చేస్తోందన్నారు. ఏదైనా ఉంటే తనను అడిగితే చెప్తానని, కానీ సొంతంగా ఊహాగానాలు చేయొద్దన్నారు.

Vijayasai Reddy s Shocking Declaration YS Jagan Won t Come to Power Again

ఈడీ విచారణలో 100 కోట్లు రాజ్ కెసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహాతో అరబిందో నుంచి మీరు ఇప్పించారా అని అడిగారని, అది నిజమేనన్నారు. ఇది జగన్ కు తెలిసి జరిగిందా, ఆయన చెప్పారా అని అడిగితే లేదని చెప్పానన్నారు. మిథున్, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మీదే తాను ఇప్పించానన్నారు. జగన్ కు లిక్కర్ స్కాంతో సంబంధం ఉందో లేదో తనకు తెలియదని, ఈ విషయం రాజ్ కెసిరెడ్డి ఒక్కడే చెప్పగలడని చెప్పానన్నారు. జగన్ కు తెలిసి ఇది జరగదని మాత్రం చెప్పానన్నారు. రేపు మిథున్ రెడ్డిని పిలిచాక తనను మరోసారి పిలుస్తారేమో అని తెలిపారు. లిక్కర్ స్కాం విషయంలో తాను అప్రూవర్ గా మారే అవకాశం లేదన్నారు. తనకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యం లేకపోవడం వల్లే తనను అరెస్టు చేయలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+