రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు(నారా) నాయుడు బాబు: సాయిరెడ్డి విమర్శలు

టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో నిత్యం టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్న విజయసాయి రెడ్డి ఇప్పుడు మరోమారు..

దోచుకున్న లక్షల కోట్లతో లక్ష క్యాంటీన్లు నడపొచ్చు : సాయిరెడ్డి

దోచుకున్న లక్షల కోట్లతో లక్ష క్యాంటీన్లు నడపొచ్చు : సాయిరెడ్డి

ఇక తాజాగా మంగళగిరిలో అన్నా క్యాంటీన్ రగడ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి మంగళగిరిలో ఏం ఖర్మ, నీవుదోచుకున్న లక్షల కోట్లతో 100 ఏళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లో లక్ష క్యాంటీన్లు నడపొచ్చు దొంగ బాబూ అంటూ సెటైర్లు వేశారు. పదేళ్లపాటు ఫ్రీగా భోజనాలు పెట్టినా నీ సంపద ఉల్లి పొట్టంత కూడా తరగదు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 2 ఎకరాల నుంచి 5 లక్షల కోట్లు ఎలా సంపాదించావో జాతీయ మీడియా ఎప్పుడో ఆధారాలతో సహా రాసింది అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేశారు.

అప్పుడు సీబీఐ వద్దన్నావు .. ఇప్పుడు సీబీఐ లేకపోతే ఎలా అంటున్నావ్

అప్పుడు సీబీఐ వద్దన్నావు .. ఇప్పుడు సీబీఐ లేకపోతే ఎలా అంటున్నావ్

అంతేకాదు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారు అంటాడు అంటూ మండిపడ్డారు. రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు(నారా) నాయుడు బాబు అని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. అందితే జుట్టు...అందకపోతే కాళ్లు - ఈ అవకాశవాది దినచర్య అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. నాడు అసెంబ్లీలో మైక్ మ్యూట్ చేయించిన చంద్రబాబు, నేడు జూమ్ మీటింగ్ లో మైక్ మ్యూట్ చేయించిన లోకేష్ అందుకే పచ్చ పార్టీని ఏపీ ప్రజలు మ్యూట్ లో పెట్టారంటూ సెటైర్ వేశారు.

ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు

ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు

ఇక పొలిటికల్ మిర్చి అంటూ వేసిన సెటైర్లో విజయసాయిరెడ్డి ముసలి నక్క గుంటనక్క పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై లోకేష్ చంద్రబాబుతో చెబుతున్నట్టు ఒ ఫోటో పెట్టి మనల్ని అన్నారు అని నా డౌట్ అనుమానం నాన్నారు అంటూ పొలిటికల్ పంచ్ వేశారు. మరో పోస్ట్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు అంటూ నిప్పులు చెరిగారు.

పార్టీ పునాదులు కదిలి క్షేత్రస్థాయిలో తుడిచి పెట్టుకుపోయింది

పార్టీ పునాదులు కదిలి క్షేత్రస్థాయిలో తుడిచి పెట్టుకుపోయింది

పార్టీ పునాదులు కదిలి క్షేత్రస్థాయిలో తుడిచి పెట్టుకుపోయింది. అయినా కూడా తండ్రీకొడుకులు (పెద్ద నాయుడు, చిన్న నాయుడు) ఉన్మాదులుగా మారి చివరకు స్కూలు పిల్లలనూ వదలడం లేదు అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక ఇటీవల పదో తరగతి విద్యార్థులతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో పాల్గొన్న లోకేష్ ను ఉద్దేశించి ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు జనానికి ఏనాడో దూరమయ్యారని, చివరికి జూమ్ లో కూడా దూరమయ్యారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+