కాంగ్రెస్ బదులు తెరాస: అధికారికి రాములమ్మ నిలదీత
మెదక్/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత విజయశాంతి బుధవారం ప్రిసైడింగ్ అధికారిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మెదక్ మండలం మద్దుల్ వాయిలో ప్రిసైడింగ్ అధికారి మధుసూదన్ రావుతో ఆమె వాగ్వాదానికి దిగారు. ప్రిసైడింగ్ అధికారి తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు కొందరు ఆమె దృష్టికి తీసుకు వచ్చారు.
దీనిపై ఆమె మండిపడింది. ప్రిసైడింగ్ అధికారి తెరాసకు మద్దతు తెలుపుతున్నారని ఆమెకు చెప్పడంతో... పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కారు గుర్తుకు ఓటేయాలని ఎందుకు చెబుతున్నారంటూ ఆయనను ప్రశ్నించారు. ఇవి ఎన్నికలనుకుంటున్నారా.. తమాషా చేస్తున్నారని అని మండిపడ్డారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. పది నిమిషాలు పోలింగ్ నిలిచిపోయింది.

కాంగ్రెస్‌కు వేయమంటే తెరాసకు
ఈవిఎంపై ఓటు వేయడం తెలియని ఓ వృద్ధురాలు కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని ఓ అధికారిని కోరగా ఆయన తెరాసకు వేశారట. దీనిపై ఆమె ఆందోళనకు దిగింది. ఇది కరీంనగర్ జిల్లాలో జరిగింది.
ఆర్ కృష్ణయ్య అనుచరులపై దాడి
హైదరాబాదులోని ఎల్బీ నగర్ టిడిపి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అనుచరులపై కాంగ్రెస్ వర్గీయులు బుధవారం దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ వర్గీయుల దాడిలో పలు వాహనాలను ధ్వంసం చేశారు. టిడిపి కార్యకర్త నాయుడిపై కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి చేయిచేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ వర్గీయులు చర్యలపై ఆర్.కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.












Click it and Unblock the Notifications