చావాలనే: తెరాసపై రాములమ్మ సంచలనం, భావోద్వేగం

Vijayasanthi
మెదక్/కరీంనగర్/హైదరాబాద్: మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మెదక్ జిల్లాలో మాట్లాడుతూ.. తాను ఎప్పుడు చస్తానా అని తెలంగాణ రాష్ట్ర సమితి ఎదురు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తనకంటూ ఎవరూ లేరని భావోద్వేగానికి గురయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తన పైన రాజకీయాలు ఆపేసి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలని ఆమె హితవు పలికారు. తాను ఒంటరినని, తనకంటూ ఎవరూ లేరని భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజల ఆప్యాయత కావాలన్నారు. తెరాస తనను టార్గెట్ చేసుకుందని విమర్శించారు.

తాను పాలక పక్షంలో లేనని ప్రతిపక్షంలో ఉన్నానని గుర్తుంచుకోవాలన్నారు. తనకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు చస్తానా అని తెరాస చూస్తోందని కానీ, తాను చావనని, ప్రజల ఆశీస్సులతో బతికే ఉంటానని చెప్పారు. తాను ప్రజలకు తలవంచుతాను తప్ప ఏ నేతకు తలవంచనన్నారు. తాను మాటల మనిషిని కాదని, తానేంటో నిరూపించుకోవడానికే రైల్వే లైన్ తీసుకు వచ్చానన్నారు.

కిరణ్‌పై విహెచ్ ఫైర్

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మండిపడ్డారు. ఏఐసిసి సమావేశానికి కిరణ్ ఒక్కరే రాలేదని, ఆయనకు ముఖం లేదన్నారు. ఇలాంటి సిఎంలు వచ్చినా రాకపోయినా నష్టం లేదన్నారు. అవిశ్వాసం పెట్టినా తెలంగాణపై సోనియా తగ్గలేదని చెప్పారు. బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేసిందన్నారు.

రథ చక్రాల కింద నలిగిపోతారు: పొన్నం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎవరు అడ్డు పడినా ఆ రథ చక్రాల కింద నలిగిపోక తప్పదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కరీంనగర్ నుండే పోటీ చేస్తానని చెప్పారు.

కిరణ్‌కు శైలజానాథ్ లేఖ

మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. సమైక్య సద్యమంలో పాల్గొన్నవారి పైన కేసులు ఎత్తి వేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+