మెదక్ లోకసభ సీటు: కెసిఆర్‌తో విజయశాంతి ఢీ?

ప్రస్తుతం మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కెసిఆర్ ఈ ఎన్నికల్లో మెదక్ సీటుకు మారే అవకాశాలున్నాయి. తనకు మెదక్ స్థానం టికెట్ ఇస్తామని కాంగ్రెసు అధిష్టానం హామీ ఇచ్చిందని, తనపై కెసిఆర్ పోటీ చేస్తే కచ్చితంగా పోటీని ఆహ్వానిస్తానని, ఎవరు కావాలో ఓటర్లు నిర్ణయించుకుంటారని విజయశాంతి అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను విజయశాంతి కలిసే అవకాశాలున్నాయి. శాసనసభకు పోటీ చేయాలని కాంగ్రెసు అధిష్టానం విజయశాంతిని అడిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఆ ప్రచారాన్ని విజయశాంతి భర్త, మేనేజర్ శ్రీనివాస ప్రసాద్ ఖండించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
గత ఎన్నికల్లో మెదక్ సీటును కాంగ్రెసు ప్రత్యర్థి నరేంద్రనాథ్‌పై కేవలం 6,077 ఓట్ల మెజారిటీతో విజయశాంతి గెలుచుకున్నారు. అయితే, ఈసారి కెసిఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని తెరాస వర్గాలంటున్నాయి. తెరాస, కాంగ్రెసు మధ్య పొత్తు కుదిరితే విజయశాంతికి మెదక్ పోటీ చేసే అవకాశం లభిస్తుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది.












Click it and Unblock the Notifications