విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణా విషాదం: సాయం చేయని మనుషుల వల్లే 22మంది మృతి

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాద జరిగి 22మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడేవున్న కొందరు మత్స్యకారులు స్పందించి కొందరు 15మంది వరకు ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.

Recommended Video

Krishna River Boat Mishap : బోటు ప్రమాదంలో మరో ట్విస్ట్ | Oneindia Telugu

ఓరే పదండ్రా! అధికారుల కన్నా మత్స్యకారులే నయం: ప్రత్యక్షసాక్షుల మాటిదిఓరే పదండ్రా! అధికారుల కన్నా మత్స్యకారులే నయం: ప్రత్యక్షసాక్షుల మాటిది

 మరికొంతమంది బతికేవారు..

మరికొంతమంది బతికేవారు..

అయితే, బోటు ప్రమాదం జరిగిన సమయంలో నదిలో చాలా పడవలు, బోట్లు చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ, వారేవరూ కూడా మానత్వంతో స్పందించకపోవడం విచారకరం. వారే ముందుకు వచ్చి ఆ బోటు దగ్గరికి వెళ్లివుంటే మరికొంత మంది ప్రాణాలు నిలిచేవే.

సోషల్ మీడియాలో చక్కర్లు

సోషల్ మీడియాలో చక్కర్లు

ప్రస్తుతం ఆ పడవ ప్రమాద దృశ్యాలు వాట్సప్‌, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాల్లోకి రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. ప్రమాదం రోజున నిత్యహారతిని వీక్షించేందుకు 6వేల మంది వచ్చారు. కాగా, అదే రోజు సాయంత్రం 5.20గంటలకు ప్రమాదం జరిగింది. పడవలోని కొంతమంది ఈదుతూ ఒడ్డుకు చేరారు.

 స్పందించింది మత్స్యకారులే

స్పందించింది మత్స్యకారులే

సుదూరంగా ఉన్న మత్స్యకారులు శంకర్‌, పిచ్చయ్య, శివయ్యలు వచ్చి బాధితులను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, స్పీడ్‌ బోటుతో కొంతమంది వచ్చి మునిగిపోతున్న వారి చుట్టూ చక్కర్లు కొట్టారు. కానీ.. బాధితులను రక్షించే ప్రయత్నం చేయకపోడం గమనార్హం.

 కాపాడే ప్రయత్నం చేయలేదు..

కాపాడే ప్రయత్నం చేయలేదు..

అంతేగాక, సమీపంలో మరో పెద్ద పడవ కూడా ఉంది. అది కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ పడవ వచ్చినా మరింత మంది ప్రాణాలు నిలిచేవి. ఇక అక్కడే ఓప్రైవేటు సంస్థ జట్టీలోపెద్ద పడవలు, స్పీడ్‌ బోట్లు నిలిపి ఉన్నాయి. వారు కూడా వాటిని తీసి రక్షించే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. బోటును పట్టుకుని గంటకు పైగా వేలాడి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు కూడా ఈ విషయం చెప్పారు.

 మనకెందుకంటూ..

మనకెందుకంటూ..

ఇది ఇలావుంటే.. ‘అరె.. నాకు ఈత వచ్చురా.. నేను వెళతాను' అని ఒక యువకుడు అంటే.. ‘మనకు ఎందుకు? వారు మరణించి ఉంటారు.. మళ్లీ కేసులు..' అనే మాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలో వినిపిస్తుండటం గమనార్హం. ఒకవేళ ప్రమాదం జరిగిన బోటు పక్కన ఉన్న ఇతర బోట్ల వారు, స్పీడ్ బోట్లలో సంచరిస్తున్న వారు మానవత్వంతో స్పందించివుంటే మరిన్ని ప్రాణాలు నిలిచిఉండేవని అనడంలో ఏమాత్రం సంశయం లేదు.

English summary
It is revealed that no other boats came to help victims of Vijayawada boat accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X