మిథున్ రెడ్డి ఓటుకు బెయిల్ పై ఉత్కంఠ..! తీర్పు రిజర్వ్..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో నాలుగో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్ లభిస్తుందా లేదా , ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు వాదనలు పూర్తి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే వాదనలు మాత్రం ఆసక్తికరంగా సాగాయి.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముందుగా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదిస్తూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కేసును ప్రభావితం చేయడానికి అవకాశాలు ఏమీ లేవన్నారు. మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా, పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్ గా ఉన్నారని గుర్తుచేశారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఆ పార్టీ ఎంపీలను లీడ్ చేయాల్సిన బాధ్యత మిథున్ రెడ్డికి ఉందన్నారు. కాబట్టి ఓటింగ్ ప్రక్రియ, ఎన్నిక ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే వరకు మిథున్ రెడ్డి కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం కోర్టు ఆదేశాలతో తిరిగి మిధున్ సరెండర్ అవుతారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఇది సాధారణంగా జరిగే ఎన్నిక ప్రక్రియ కాదన్నారు. ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడంతో ఆయనే స్వచ్చంధంగా లొంగిపోయారని లాయర్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిథున్ రెడ్డి పాల్గొనకుండా సెట్.. కోర్టును తప్పుదారి పట్టిస్తుందన్నారు. అమృత్ పాల్ సింగ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ మిథున్ రెడ్డి కేసులో వర్తించదన్నారు.

దీనికి స్పందనంగా సిట్ తరపు న్యాయవాది..మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అమృత్ పాల్ సింగ్ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పిందని గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అమృత్ పాల్ సింగ్ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications