Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రైసిస్‌లో కనిపించకపోతే ఎలా- ఆయనకు ఇచ్చి పడేసిన పూనమ్ కౌర్

Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్‌, చిట్టినగర్‌, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

Vijayawada floods 2024 Actress Poonam Kaur made key remarks

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మొత్తం విజయవాడ, గుంటూరుల్లో మకాం వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రెండు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటోన్నారు. వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. అర్ధరాత్రిళ్లు కూడా ఆయన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోన్నారు.

కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ.. ఇలా దాదాపుగా మంత్రులందరూ రోడ్ల మీదే ఉంటోన్నారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో సహా భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ విభాగం కార్యాలయంలో సమీక్షలను నిర్వహిస్తోన్నారు.

అందరూ ఉన్నప్పటికీ- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం అందుబాటులో ఉండకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడలో వరద సంభవించి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఆయన జాడ కనిపించట్లేదు. సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి కొన్ని వరుస ట్వీట్లు పెట్టారంతే.

పవన్ కల్యాణ్ కనిపించకపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ నటి పూనమ్ కౌర్.. తెర మీదికి వచ్చారు. తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఘాటు కామెంట్స్ పెట్టారు. సంక్షోభ సమయాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.

ఇలాంటి సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాజకీయ నాయకులు అందుబాటులో ఉండకపోవడం, వాళ్లు కనిపించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఇది ఆ రాజకీయ నాయకుల పచ్చి అవకాశవాదానికి, నిలువెత్తు స్వార్థానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆమె చేసిన ఈ పోస్ట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే అయివుంటుందంటూ రిప్లైలు పెడుతున్నారు నెటిజన్లు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+