Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ రైలు ప్రయాణికులకు గమనిక- ఈ రూట్ లో ఇకపై..!!

విజయవాడ డివిజన్ రైలు ప్రయాణికులకు శుభవార్త. చెన్నై సెంట్రల్ మార్గంలో మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు ఉండబోవు. ఇప్పటివరకు డబ్లింగ్ లో ఉన్న లైన్ ఇది. అత్యంత రద్దీతో కూడుకున్న ఉన్న రూట్ కావడం వల్ల దీన్ని అప్ గ్రేడ్ చేశారు. మూడో రైల్వే లైన్ మార్గాన్ని నిర్మించారు. ఈ ట్రాక్ ను ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వే తన నెట్‌వర్క్ సామర్థ్యం పెంపునకు మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే దృష్టి సారించింది. ప్రత్యేక రైళ్లను నడిపించడంతో పాటు కొత్త రైల్వే మార్గాలు, డబ్లింగ్/ట్రిప్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోనే అత్యంత ఆదాయం అందుతోన్న జోన్ ఇది. ఉత్తరం- దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసే పలు రద్దీ ట్రాక్ లు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి.

Vijayawada-Gudur 3rd Rail Line Commissioned to Ease congestion on route

అందులో ఒకటి.. విజయవాడ- చెన్నై సెంట్రల్. పలు రద్దీ రైళ్లు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. ఏపీ తీర ప్రాంతంలో గ్రాండ్ ట్రంక్ రూట్ లో ఉన్న విజయవాడ-గూడూరు సెక్షన్ అత్యంత కీలకం. ఉత్తర, తూర్పు రాష్ట్రాలను దక్షిణాదిని కనెక్ట్ చేయడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల రద్దీ పెరగడంతో ఈ మార్గం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

దీన్ని తగ్గించాలనే ఉద్దేఁశంతో 2015-16లో విజయవాడ-గూడూరు మూడో లైన్ ప్రాజెక్టు మంజూరైంది. 288 కిలోమీటర్ల పొడవు గల ప్రాజెక్ట్ ఇది. సుమారు రూ. 3,246 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా బాపట్ల-చుండూరు మధ్య 32 కిలోమీటర్ల రైల్వే సెక్షన్‌ను ఇదివరకే విజయవంతంగా పూర్తి చేసింది. విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగం ఇది.

సూర్యారెడ్డిపాలెం-చుండూరు మధ్య ఇప్పటికే 106 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా మూడో లైన్, విద్యుదీకరణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గూడూరు-సింగరాయకొండ (127 కి.మీ), బాపట్ల-సూర్యారెడ్డిపాలెం (74 కి.మీ), బాపట్ల-చుండూరు (32 కి.మీ) ఇలా దశలవారీగా ట్రిప్లింగ్ పనులను ఏకకాలంలో చేపట్టింది. తాజాగా 281 కిలోమీటర్ల మేర విజయవాడ- గూడూరు సెక్షన్ లో మూడో లైన్ ప్రారంభించామని, ఇది అందుబాటులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+