బార్‌లోనే రసాయనం కలిపారని నివేదిక: సోదరుడి లొంగుబాటు, కటక్‌లో మల్లాది విష్ణు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కల్తీ మద్యం కేసులో కాంగ్రెసు నేత మల్లాది విష్ణు సోదరుడు మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ శుక్రవారం లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, మత్త కోసం మద్యంలో తెల్లటి పదార్థాన్ని కలిపినట్లు, దాన్ని క్యాషియర్ విక్రయించాడని మల్లాది శ్రీనివాస్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
కాగా, మల్లాది విష్ణు కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడు. అతను ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఒడిశాలోని కటక్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యంలో మత్తు కోసం స్పిరిట్ కలిపినట్లు క్యాషియర్ వెంకటేశ్వర రావు అంగీకరించినట్లు చెబుతున్నారు.

కల్తీ మద్యానికి సంబంధించి ఆబ్కారీ శాఖకు కెమికల్ రిపోర్టు వచ్చింది. మెయిల్ ద్వారా ల్యాబ్ నుంచి ఆ నివేదికను పంపించారు. స్వర్ణ బార్‌లోనే మద్యంలో కల్తీ జరిగిందని నివేదికలో తేల్చారు. డిపోల నుంచి బార్‌లకు వచ్చిన 9 బ్రాండ్లలో కల్తీ మద్యం లేదని కెమికల్ పరీక్షలో తేలినట్లు చెబుతున్నారు. చీప్ లిక్కర్‌లో స్పిరిట్ కన్నా శక్తివంతమైన రసాయనం కలిపినట్లు నివేదికలో చెప్పినట్లు సమచారం.
విజయవాడలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఐదుగురు మరణించగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆస్వస్థతకు గురైనవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications