డ్రైవర్ నుంచి నేతగా మల్లాది విష్ణు: చరిత్ర, ఆస్తులపై గుట్టుగా సేకరణ?
విజయవాడ: బెజవాడలోని కృష్ణలంక స్వర్ణబార్ కల్తీ మద్యం మరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యవహారాల పైన నిఘా ఉంచారు. ఆయన చరిత్ర పైన నిఘా పెట్టారని తెలుస్తోంది. ఆయన రాజకీయ ప్రస్థానం, ఆస్తిపాస్తులు ఏమిటి.. తదితర అంశాల పైన నిఘా వేసినట్లుగా తెలుస్తోంది.
స్వర్ణబార్ కల్తీ మద్యం మరణాలతో విష్ణు వ్యవహారాల పైన నిఘా ఎక్కువగా పెట్టారు. ఒకప్పుడు ప్రముఖ నేత అనుచరుడిగా, ఆయన డ్రైవరుగా పని చేసిన మల్లాది విష్ణు క్రమంగా ప్రముఖ నేతగా ఎదిగారు. దీనిపై నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నాయని తెలుస్తోంది. ఆర్థిక వనరుల పైన దృష్టి సారించారని తెలుస్తోంది.

విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఆస్తులు, ఆదాయ వనరుల పైన చర్చ సాగుతోంది. బెజవాడలో పాతికేళ్లలో విష్ణు ప్రముఖ నేతగా ఎదిగారు. వైయస్ అనుచరుడిగా గుర్తింపు పొందూతూ వుడా అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగారు.
విష్ణు బంధువులకు నగరంలో మరో మూడు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నట్లు, మరికొన్ని మద్యం షాపులు, బార్లు అనుచరుల పేరిట నడుస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. త్వరలో విష్ణు ఆస్తులు, వ్యవహారాల పైన నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయని సమాచారం.
కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించిన ఘటనకు సంబంధించిన కేసులో మల్లాది విష్ణు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నివేదికలో... స్వర్ణబార్‌లోనే కల్తీ జరిగిందని తేలింది. ప్రభుత్వం సరఫరా చేసిన తొమ్మిది బ్రాండ్లలో కల్తీ జరగలేదని, బార్‌కు వచ్చాకే కల్తీ జరిగిందని తేలింది. మరోవైపు, విష్ణు బెజవాడలో లేరని కూడా వార్తలు వస్తున్నాయి. అతను కటక్‌లో ఉన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications