5 Paisa Meals : విజయవాడలో ఐదు పైసలకే ఫుల్ మీల్స్- భారీరెస్పాన్స్-50 మంది తర్వాత..
వ్యాపార సంస్ధలు, మాల్స్ ప్రమోషనల్ ఆఫర్స్ ఇవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే ఆ ఆఫర్ లన్నింటికంటే భిన్నంగా విజయవాడలో ఓ హోటల్ ఇవాళ ఓ సర్ ప్రైజ్ ఆఫర్ ఇచ్చింది. తమ హోటల్ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఈ ఆఫర్ కు ముందుగానే ప్రచారం కూడా అదే స్ధాయిలో చేయడంతో ఇవాళ జనం ఎగబడ్డారు. దీంతో అందరికీ సినిమా తప్పలేదు.
ఇవాళ ఒక్కరోజు మధ్యాహ్నం 5 పైసలకే భోజనం పెడతామని విజయవాడలో తాజాగా ప్రారంభమైన ఓ హోటల్ కస్టమర్లకు ప్రమోషనల్ ఆఫర్ ఇచ్చింది. అయికే కేవలం 5 పైసలు మాత్రమే తెచ్చిన వారికి ఈ ఫుల్ మీల్స్ ఇస్తారు. అక్కడే తినేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ముందుగానే ప్రచారం చేయడంతో ఉదయం హోటల్ తెరవగానే జనం క్యూ కట్టారు. ఐదు పైసల కాయిన్ తెచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలియడంతో జనం ఇళ్లలో, ఎక్కడెక్కడో వెతికి కాయిన్స్ తెచ్చారు. దీంతో హోటల్ యాజమాన్యం ఊహించని స్ధాయిలో స్పందన వచ్చింది.

ఈ ఆఫర్ ప్రకారం ఐదు పైసల కాయిన్ తెచ్చి వారికి 400 రూపాయల విలువగల సౌత్ ఇండియా థాలీ ఫ్రీగా ఇచ్చారు.
దీంతో ఐదుపైసల కాయిన్స్ తో ఉదయం నుండి హోటల్ బయట జనం పడిగాపులు పడ్డారు. అయితే విపరీతంగా జనం తరలిరావడంతో వీరందరికీ ఆఫర్ వర్తింపచేయడం నిర్వాహకులకు సైతం కష్టంగా మారింది. దీంతో తొలి 50 మందికే ఈ ఆఫర్ వర్తింపజేసి మిగతావారికి మాత్రం 200 రూపాయలకు దీన్ని వడ్డించారు. అయినా జనం స్పందన తగ్గలేదు. తద్వారా వారు కూడా నిరుత్సాహ పడకుండా చేశారు. దీంతో జనం కూడా 200 పెట్టి మరీ తిని వెళ్లారు.
చివరికి భోజన సమయం తర్వాత 1100 ఐదు పైసల కాయిన్స్ వచ్చినట్లు హోటల్ యజమానురాలు ప్రకటించారు.
విజయవాడలో ఐదు పైసలకే ఫుల్ మీల్స్- బంపర్ ఆఫర్ కు భారీ రెస్పాన్స్..!!#Vijayawada #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/KNYhX5BR24
— oneindiatelugu (@oneindiatelugu) December 2, 2022












Click it and Unblock the Notifications