టీడీపీ కంచుకోటలో వైసీపీ చేతికి కొత్త "అస్త్రం" - 2019 రిపీట్..!?

వై నాట్ 175..ఇదీ సీఎం జగన్ నినాదం. 175 సీట్లు మనవే..చంద్రబాబు ధీమా. ఇదే సమయంలో సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ముందస్తుగానే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ప్రత్యర్ధి పార్టీల కంచుకోటల పై ఇద్దరూ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం కావటం చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. ఈ సారి ఎన్నికల్లో తిరిగి బలం చాటాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పొత్తులకు సిద్దమయ్యారు. ఇటు జగన్ పూర్తి ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ కంచుకోటగా ఉన్న కీలక జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలే అక్కడ రిపీట్ అవుతాయా..టీడీపీ సరిదిద్దుకుంటుందా..

టీడీపీ కంచుకోటలో లుకలుకలు

టీడీపీ కంచుకోటలో లుకలుకలు


విజయవాడ లోక్ సభ..పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తొలి నుంచి టీడీపీకి బలం ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ మద్దతు కనిపిస్తోంది. కాంగ్రెస్ - టీడీపీ మధ్య హోరా హోరీ పోరు సాగేది. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ విజయవాడ లోక్ సభ టీడీపీ గెలుచుకుంది. జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే దక్కించుకుంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇక్కడ నుంచి వరుసగా రెండో సారి ఎంపీగా గెలిచిన తరువాత కొంత కాలానికే లోకల్ రాజకీయాలు మొదలయ్యాయి. స్థానికంగా కొందరు టీడీపీ నేతలు..కేశినేని మధ్య గ్యాప్ పెరిగింది. పలు సందర్భాల్లో కేశినేని టీడీపీ వీడుతున్నారని ప్రచారం సాగింది. ఇప్పుడు తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీకి సిద్దమని కేశినేని చెబుతున్నారు. అదే సమయంలో తన లోక్ సభ పరిధిలో..తాను చెప్పిన వారికే సీట్లు దక్కేలా పావులు కదుపుతున్నారు. ఇది కేశినేని వ్యతిరేక వర్గానికి రుచించటం లేదు. జనసేనతో పొత్తుతో పశ్చిమ - సెంట్రల్ సీట్లు వదులుకొనే పరిస్థితి కనిపిస్తోంది.

టీడీపీ నేతల కోల్డ్ వార్ తో కొత్త లెక్కలు

టీడీపీ నేతల కోల్డ్ వార్ తో కొత్త లెక్కలు


విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో తాను బరిలోకి దిగుతున్నట్లు కొద్ది రోజుల క్రితం బుద్దా వెంకన్న ప్రకటించారు. తాజాగా కేశినేని నాని టీడీపీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే దాని పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కాల్ మనీ లో ఉన్న వాళ్లకు టికెట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. మైలవరంలోనూ మాజీమంత్రి దేవినేని ఉమాకు వ్యతిరేకంగా కేశినేని నాని మరో ముఖ్య నేతను బరిలోకి దించేలా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మైలవరంలోనూ తన వర్గాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని రంగంలోకి దించి...తెర వెనుక మద్దతిస్తున్న వారే టార్గెట్ గా ఇప్పుడు కేశినేని కొత్త రాజకీయం ప్రారంభించారు. రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానికి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయంగా మద్దతు దారుల సంఖ్య ఉంది. అదే సమయంలో వ్యతిరేకులు ఉన్నారు. దీంతో, ఇప్పుడు ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయం అంతు చిక్కటం లేదు.

వైసీపీకి అనుకూలంగా - చేతికి కొత్త అస్త్రం

వైసీపీకి అనుకూలంగా - చేతికి కొత్త అస్త్రం


మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో విజయవా - గుంటూరు పైన ఈ సారి వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ రెండు లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే విజయవాడ తూర్పు అభ్యర్ధిగా దేవినేని అవినాశ్ ను సీఎం జగన్ ప్రకటించారు. వరుసగా రెండో సార్లు కోల్పోయిన విజయవాడ ఎంపీ స్థానం దక్కించుకోవటం కోసం సామాజికంగా కొత్త సమీకరణాలను తెర మీదకు తెస్తోంది. ఇదే సమయంలో కేశినేని నాని మద్దతు..వ్యతిరేక వర్గాలుగా టీడీపీలో వస్తున్న గ్యాప్ ను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. విజయవాడ లోక్ సభ పరిధిలో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం విజయవాడ తూర్పు మాత్రమే గెలిచింది. ఇప్పుడు తిరిగి...క్రిష్ణా జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు విజయవాడ కేంద్రంగా టీడీపీలో చోటు చేసుకుంటున్న రాజకీయం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+