Kesineni Nani : ప్రధాని మోడీకి కేశినేని ఫిర్యాదు-వెంటనే జోక్యం చేసుకోవాలని వినతి..

నిన్న చిత్తూరు జిల్లా పుంగనూరులో, ఇవాళ శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. చంద్రబాబు రాయలసీమ టూర్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మీ దృష్టికి తేవాలనుంటున్నట్లు కేశినేని నాని తన ట్వీట్ లో ప్రధానికి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరుతో పాటు అన్నమయ్య జిల్లా అంగళ్లు, కురబకోట గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల తాజా దాడులతో టీడీపీ నేతలకు, పోలీసులకు గాయాలైనట్లు కేశినేని తెలిపారు.

చంద్రబాబు పర్యటన అడ్డుకునేందుకు స్దానిక వైసీపీ మంత్రి గూండాల్ని పంపించడం ఆందోళన కలిగిస్తోందని, దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్నాయని కేశినేని ఆరోపించారు. ఈ ఘటనలు పౌరుల ప్రాణాలకు హానికరంగా మారాయని, ప్రజాస్వామ్య ప్రక్రియకు, పౌర హక్కులకు విఘాతం కల్పిస్తున్నాయన్నారు. శాంతి భద్రతలు కాపాడటం దర్యాప్తు సంస్ధల విధి అని, కానీ తాజా ఘటనల్లో పోలీసుల స్పందన పేలవంగా ఉందన్నారు. పోలీసులు తమ సిబ్బందినే కాపాడుకోలేని స్ధితిలో ఉండటం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, తాజా ఘటనలపై దర్యాప్తు చేయించాలని కోరారు.

kesineninaniwrotealettertomodi

ఏపీలో శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కేశినేని నాని కోరారు. అలాగే అవాంఛనీయ ఘటనలు జరిగి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు కలగకుండా తగిన భద్రత కల్పించాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలతో తాజా ఘటనలపై దర్యాప్తు చేయించాలని కూడా ప్రధానిని కోరారు. దేశంలో రాజకీయ నేతలు, ప్రజల భద్రత చూడటం ప్రభుత్వం యొక్క విధి అని కేశినేని గుర్తుచేశారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిన్న పుంగనూరులో చోటు చేసుకున్న ఘటనలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు టూర్ సందర్భంగా ఈ ఘర్షణలు చోటు చేసుకోవడంతో అధికార వైసీపీ టీడీపీపై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే టీడీపీ మాత్రం చంద్రబాబు టూర్ ను అడ్డుకునేందుకు వైసీపీ దాడులకు పాల్పడిందని ఆరోపిస్తోంది. ఇప్పటికే దీనిపై డీజీపీతో పాటు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు సోమవారం ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగో లేదని, చంద్రబాబు పర్యటన లో రాళ్ళ దాడి విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని కేశినేని నాని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, జగన్ పాలన లో ఏ వర్గం వారు సంతోషంగా లేరన్నారు. టీడీపీ ఎంపీల బృందం సోమవారం ప్రధాని మోదీని కలుస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే అభివృద్ధి జరగదని, వైసీపీ మీద వ్యతిరేకత పెరిగినందునే దాడులు చేస్తున్నారన్నారు. చంద్రబాబుపైనే దాడులు జరుగుతుంటే.. సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ లు నేతల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+