రౌడీ షీటర్లకు విజయవాడ పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరంలో నేరాలు, వాటి తీవ్రత ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచడం, రౌడీ షీటర్లు, జైలుకు వెళ్లి వచ్చిన వారిపై నిఘా పెంచడం సహా పలు చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఎక్కడో ఒకచోట నేరాల ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు అన్నిచోట్లా రౌడీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ డీసీపీలు శ్రీ కృష్ణ కాంత్ పటేల్, బి.లక్ష్మీ నారాయణ ఏసీపీలు, పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీసు స్టేషన్లు, టాస్క్ ఫోర్స్ కార్యాలయాల్లో అయా పోలీసు అధికారులు, వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ లకు, లా & ఆర్డర్, క్రైమ్ సస్పెక్ట్ లకు, చెడునడత కలిగిన వ్యక్తులకు వివిధ సమయాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఇందులో అధికారులు.. ప్రతీ ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం చేయరాదని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా గంజాయి , ఇతర మత్తు పదార్ధాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా సత్ ప్రవర్తన మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా, ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications