ఏప్రిల్ తర్వాత హైదరాబాద్ నుంచి మీరు రాజమండ్రి, వైజాగ్ ఎలా వెళతారు?
గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆదాయం సమకూరే వనరులు ఎటువంటివి లేకపోవడంతో ఆర్థికంగా అథోగతి పాలైన ఏపీకి ప్రస్తుతం ప్రజలు కట్టే పన్నులు, కరెంటు బిల్లులద్వారానే ఆదాయం సమకూరుతోంది. ఏ పని తలపెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటంతో ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. గతంలో మొదలైనవాటిని పూర్తిచేయడం, మరికొన్నింటిని నాలుగు లైన్లుగా, ఆరులైన్లుగా మార్చడానికి అంగీకరించి ఆ మేరకు పనులు ప్రారంభిస్తోంది.
ట్రాఫిక్ ను నియంత్రించాలనే ఉద్దేశంతో
పనులు పూర్తికాకపోయినప్పటికీ రద్దీని నియంత్రించాలనే ఉద్దేశంతో సంక్రాంతి సమయంలో విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా రాకపోకలకు అనుమతిచ్చారు. ప్రస్తుతం వాటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలకల్లా పూర్తికానున్నాయి. దీనివల్ల హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించి, గొల్లపూడి నుంచి ఈ హైవేలోకి వచ్చి నగరంలోకి వెళ్లేపని లేకుండా చినఆవుటపల్లి మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వెళ్లిపోవచ్చు. కృష్ణా నదిపై రాకపోకలను అనుమతించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇబ్రహీంపట్నం, గొల్లపూడివైపు నుంచి అమరావతి రావచ్చు. చెన్నై-కోల్ కతా రహదారిలో కాజ నుంచి నేరుగా గొల్లపూడి చేరుకొని అక్కడి నుంచి చిన ఆవుటపల్లి మీదుగా ఏలూరువైపు వెల్లిపోవచ్చు.

వంతెన దాటితే చాలు
కృష్ణా నదిపై వంతెన దాటిన తర్వాత వెంకటపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్, పాలవాగు మీదుగా కొత్తగా టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు. పెనుమాక-కృష్ణాయపాలెం-మందడం రోడ్డులో ఇది కలుస్తుంది. కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల మేర వంతెన అందుబాటులోకి రానుంది. అలాగే ఆరు లైన్ల రహదారి కూడా నాలుగు కిలోమీటర్ల మేర అందుబాటులోకి వస్తుంది. ఈ బైపాస్ పూర్తవగానే నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణా నదిమీదుగా కాజ దగ్గరకు రావచ్చు. మార్గమధ్యంలో కావాలంటే అమరావతి వెళ్లిపోవచ్చు. ఏప్రిల్ సమయానికి కాజ-గొల్లపూడి మధ్య దాదాపు 18 కిలోమీటర్ల ఆరులైన్ల రహదారి అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గం మధ్యలోనే వెంకటపాలెం వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు విజయవాడ-అమరావతి రహదారిని కూడా ఇది కనెక్ట్ చేస్తోంది.












Click it and Unblock the Notifications