హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లంచం ఇవ్వలేదని బర్త్ బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ప్రకాశం: లంచం ఇవ్వలేదనే అక్కసుతో జనన ధృవీకరణ పత్రానికి బదులు మరణ ధృవీకరణ పత్రానికి జారీ చేశాడో లంచాలకు బాగా అలవాటు పడిన ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం జమ్మనపల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జమ్మనపల్లి గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు తనకు రూ. 400 ఇవ్వలేదని ఓ చిన్నారికి జనన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉండగా మరణ ధృవీకరణ పత్రాని జారీ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంలో లబ్ధి పొందేందుకు అరుణ అనే మహిళ తన కూతురు జనన ధృవీకరణ పత్రం కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకుంది.

 A village secretary passed death certificate instead of birth certificate for bribe

అయితే కార్యదర్శి వెంకటేశ్వర్ రావు అడిగిన లంచం ఇవ్వకపోవడంతో.. అతడు ఆ చిన్నారికి మరణ ధృవీకరణ పత్రం జారీ చేశాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ నుంచి ఈ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
A Village Secretary issued death certificate instead of birth certificate for not giving him bribe in Jammanapally in Prakasham district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X