దారుణం... అర్ధరాత్రి గ్రామ వాలంటీర్ దారుణ హత్య... గునపంతో పొడిచి చంపిన దుండగులు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది.కూడేరు మండలం శివరాంపేట గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీకాంత్ అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. పొలం వద్ద నిద్రిస్తున్న అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు గునపంతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే... శివరాంపేట గ్రామంలో శ్రీకాంత్ అనే యువకుడు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం(మార్చి 12) రాత్రి పొలం వద్దకు వెళ్లిన శ్రీకాంత్ అక్కడే నిద్రించాడు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న కొంతమంది శ్రీకాంత్ హత్యకు గురైన విషయాన్ని గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాంత్‌ను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. పోలీసులకు కూడా సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

village volunteer brutally murdered in the midnight in anantapuram district

శ్రీకాంత్ శరీరంపై గునపంతో పొడిచిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అతనిది హత్యేనని నిర్దారించారు. శ్రీకాంత్ తండ్రి ప్రత్యర్థులు అతన్ని చంపబోయి అతని కుమారుడు శ్రీకాంత్ చంపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పొలం వద్ద నిద్రిస్తున్నది శ్రీకాంత్ తండ్రి అనుకుని హత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.

శ్రీకాంత్ తండ్రి గ్రామంలో తరుచూ గొడవలు పడేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతనిపై కక్ష పెంచుకున్నవారెవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారా అని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+