బెజవాడ దుర్గ గుడిలో అధికారుల అత్యుత్సాహం: నిలిచిన నివేదన
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడిలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారుల తీరు వల్ల అమ్మవారి నివేదన మంగళవారం నాడు బయటనే ఆగిపోయిందని చెబుతున్నారు.
అమ్మవారి నివేదన సేవల సమయంలో కొందరు వీఐపీలను అమ్మవారి గర్భగుడిలోకి అధికారులు అనుమతించారు. నివేదన సమయంలో వీఐపీ భక్తులను లోపలకు పంపించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నివేదన బయటే నిలిచోపవడంపై వైదిక కమిటి మండిపడింది.

యువతిని రక్షించిన భవానీ భక్తులు
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని భవానీ భక్తులు రక్షించారు. కుటుంబ సభ్యులు మందలించారనే మనస్థాపంతో ఓ యువతి బ్రిడ్జ్‌పై నుంచి గోదావరి కాల్వలోకి దూకింది. దీనిని గమనించిన భవానీ భక్తులు కాల్వలోకి దూకి యువతిని రక్షించారు. యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకుంటోంది.












Click it and Unblock the Notifications