విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ(Virat Kohli).. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాడు. సోషల్‌మీడియాలో ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అత్యంత విలువైన ఆటగాడిగా మారిన కోహ్లి ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. స్టాక్ గ్రో అనే కంపెనీ గణాంకాలను వెల్లడించింది. నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లుగా తెలిపింది. అంతర్జాతీయంగా క్రికెటర్లు ఆర్జిస్తున్న ఆదాయం పరంగా చూసుకున్నా ఇది చాలా ఎక్కువ.
* కోహ్లీకి టీమ్‌ఇండియా 'A+' కాంట్రాక్ట్ ఉంది దీనిద్వారా బీసీసీఐ నుంచి రూ. 7 కోట్లు లభిస్తాయి. ప్రతి టెస్టుకు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు పొందుతాడు.
* ఐపీఎల్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. దీనిద్వారా సంవత్సరానికి రూ.15 కోట్లు పొందుతాడు.

* 18 బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఒక్కో ప్రకటనలో నటించేందుకు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడు. వీటిద్వారానే రూ.175 కోట్లు సంపాదిస్తున్నాడు.
* సోషల్‌మీడియాలో కోహ్లీకున్న క్రేజ్ తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు రూ.8.9 కోట్లు తీసుకుంటున్నాడు. ట్విటర్‌లో ఒక్కో పోస్టుకు రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.
* కోహ్లీకి ముంబయిలో రూ.34 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. గురుగ్రామ్ లో రూ.80 కోట్ల విలువ చేసే మరో ఇల్లు ఉంది. రూ.31 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి.
* ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ క్లబ్, ఓ టెన్నిస్ జట్టు, ప్రో రెజ్లింగ్ జట్టుకు యాజమానిగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications